Drunk Groom Sleeps At His Wedding In Assam
Drunk Groom: సరిగ్గా పెళ్లీ పీటల మీద ఉన్నాడు వరుడు. అతడికి కాస్త తిక్క తిక్కగా ఉంది. అంతే కాదు, కూర్చోవడానికి కూడా ఓపిక లేదు. పక్కనొళ్లతో చెప్తున్నాడు పడుకుంటానని. పెళ్లి పీటల మీద ఇదేంటని అనుకుంటున్నారా. వరుడు ఫుల్లుగా తాగేసి మండపానికి వచ్చాడు. ఆ మైకమే ఇదంతా. ఎవరు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఒకరి ఒళ్లో పడుకున్నాడు. దీనికి తీవ్ర ఆగ్రహం చెందిన వధువు.. పెళ్లిని రద్దు చేసుకుంది. అస్సాంలోని నల్బరి జిల్లాలో జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Goa Forest Fire: గోవాలో దావానలం.. తగలబడుతున్న అడవులు.. ప్రధాని మోదీ సమీక్ష
వీడియో ప్రకారం.. పెళ్లి కర్మలు చేస్తుంటే వరుడు చాలా ఇబ్బందిగా కూర్చుకున్నాడు. ఆ తంతు నిర్వహించేందుకు అతడికి ఓపిక లేదు. పెళ్లిలో ఉన్న పండితుడు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. వరుడి స్నేహితుడు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. తాగి వచ్చిన ఆ వరుడి పేరు ప్రసెంజిత్ హలోయి. నల్బరి పట్టణ నివాసి.
Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
కాగా, ఈ విషయమై వధువు బంధువులు మాట్లాడుతూ ‘‘పెళ్లి అనుకున్న విధంగా ఘనంగా జరుగుతోంది. దాదాపు అన్ని రకాల పూజలు, కార్యక్రమాలు నిర్వహించాం. ఈ పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మా కుటుంబం ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో పరిస్థితి మరో మలుపు తిరిగింది. పెళ్లి పీటల మీద కూర్చోడానికే వధువు ఒప్పుకోలేదు. వరుడు ఒక్కడే కాదు. వరుడి తరపున 95 శాతం మంది బంధువులు తాగే ఉన్నారు. మేం వెంటనే స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని అన్నారు.
Land for Jobs Scam: లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో రూ.600 కోట్ల అవినీతి బట్టబయలు.. ఈడీ
వరుడు కనీసం కారులో నుంచి దిగే స్థితిలో కూడా లేడని వధువు తరపు బంధువులు అంటున్నారు. ఇంక వరుడి తండ్రి అయితే అంత కంటే ఎక్కువ మత్తులో ఉన్నాడట. వెంటనే నల్బారి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.