కొత్త కొత్త హెయిర్ స్టైల్ తో అబ్బాయిలు ఫోజులు కొడుతుంటారు. కానీ ఓ ఏనుగు సూపర్ హెయిల్ స్టైల్ తో ఫోజులు కొట్టటం మీరెప్పుడైనా చూశారా? బహుశా చూసి ఉండరులెండి. హా..ఏనుగేంటీ..హెయిర్ స్టైట్ ఏంటీ ఏనుగుకి ఎక్కడన్నా జుట్టు ఉంటుందా? ఉంటే కొద్దిగా ఉందా లేదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇది నిజ్జంగా నిజం..నుదిటిన చక్కగా నామం పెట్టుకున్న ఏనుగుల్ని దేవాలయాల్లో చూసే ఉంటారు. కానీ ఓ దేవాలంలో ఉన్న ఏనుగు చక్కగా హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రెండ్లీ హెయిర్ స్టైల్ తో ఈ గజరాజు పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది.
ఈ ‘సెంగమాలమ్’ ఏనుగు చక్కని హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకుంటోంది. అది కూడా బాబ్డ్ కట్ హెయిర్ స్టైల్ తో. తన ముఖానికి చక్కగా సెట్ అయ్యింది ఈ క్రాఫింగ్. ఇక చూడాలీ…ఈ సెంగమాలం ఏనుగు ఆ అందం చూసి తీరాల్సిందే.’సెంగమాలమ్’కు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘సెంగమాలమ్’ ఫొటో పోస్టు చేస్తే చాలు… లైకులు పోటెత్తుతాయి. బాబ్డ్ కట్ ‘సెంగమాలమ్’ అంటే సోషల్ మీడియాలో మాంచి క్రేజ్ ఏర్పడింది.
‘సెంగమాలమ్’ స్వస్థలం కేరళ. 2003లో సెంగమాలమ్ ను మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దీని మావటి రాజగోపాల్ దీనికి ప్రత్యేకమైన క్రాఫ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ముఖంపై తిరునామాలు, ఆపైన అందమైన హెయిర్ స్టయిల్… ‘సెంగమాలమ్’ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి.
Read Here>>పేడను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం : కిలో ఎంతంటే..