Father pony tail to daughter with vacuum cleaner : తండ్రి, కూతుళ్ల ప్రేమ..కలిపితే మిలియన్ డాలర్ల హ్యాపీనెస్..ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్అయిన వీడియో. ఓ తండ్రి తన చిన్నారి కూతురికి ఐదంటే ఐదే క్షణాల్లో పోనీ టైల్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రి కూతురు జుట్టుని ‘టచ్’ చేయకుండానే ఐదు క్షణాల్లో పోనీ టైల్ వేసేసిన టెక్నిక్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
సాధారణంగా ఆడవాళ్లు జుట్టుని పోనీ టైల్ వేసుకోవాలంటే ఓ చేత్తో రబ్బర్ బ్యాండ్ పట్టుకుని మరో చేత్తో జుట్టంతా ఒడిసి పట్టుకుని బ్యాండ్ పెట్టుకుంటారు.కానీ ఓ తండ్రి మాత్రం తన చిన్నారికి పోనీ టైల్ వేయటానికి అస్సలు జుట్టుని టచ్ కూడా చేయలేదు. ఈ టెక్నిక్ చూసిన నెటిజన్లు వార్నీ ఇంత ఈజీయా అంటూ ప్రశంసిస్తున్నారు.
తండ్రి – కూతుళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురిని తండ్రి యువరాణిలా చూసుకుంటాడు. గుండెలమీద పెట్టుకుని పెంచుకుంటాడు. అమ్మ ఇంట్లో లేకపోతే కూతురికి ఎన్నో సేవలు చేస్తాడు. అలా ఓ తండ్రి తన కూతురికి పోనీ టైల్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కూతురికి పోనీ టైల్ వేసేందుకు ఆ తండ్రి వాక్యూమ్ క్లీనర్ వాడడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. చిన్నారి అద్దం ముందు నిల్చోగా..తండ్రి వాక్యూమ్ క్లీనర్‌కు రిబ్బన్ చుట్టాడు. వెంటనే వెనుక జుట్టును వాక్యూమ్ క్లీనర్‌లోకి వెళ్లేలా చేశాడు. దీంతో జుట్టుంతా చుట్టుకుంది. ఆటోమేటిక్‌గా ఆ రిబ్బన్ జుట్టుకు చుట్టుకొని పోనీ టైల్ పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి సంబంధించి వీడయో వైరల్ గా మారటంతో లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘‘తండ్రి, కూతురు మధ్య ప్రేమ.. కలిపితే మిలియన్ డాలర్ల హ్యాపీనెస్’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
#MenWillBeMen ??.
Dad + Daughter = Coolest Besties ever.?
VC – Social Media. pic.twitter.com/r1YX86SWHu
— Dipanshu Kabra (@ipskabra) February 11, 2021
ఈ వీడియోను దీపాన్షు కార్బా అనే పోలీసు అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డాడ్ + డాటర్.. కూలెస్ట్ బెస్టీస్ ఎవర్ అని క్యాప్షన్ పెట్టారు.
#MenWillBeMen ??.
Dad + Daughter = Coolest Besties ever.?
VC – Social Media. pic.twitter.com/r1YX86SWHu
— Dipanshu Kabra (@ipskabra) February 11, 2021