Gready dad : 4 ఏళ్ల కూతురితో సంభాషణ తర్వాత 170 పౌండ్లు బరువు తగ్గిన తండ్రి.. అదెలా?

ఓ ప్రమాదం కారణంగా అతను విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఎడమకాలి కండరాలు పనిచేయడం మానేశాయి. అయితే 4 ఏళ్ల కూతురితో జరిగిన సంభాషణ అతని జీవితాన్ని మార్చేసింది. ఇంతకి ఆ చిన్నారి తండ్రిని ఏం అడిగింది? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరే చదవండి.

Gready dad

Gready dad : ఇటీవల కాలంలో చాలామంది ఒబెసిటీతో (obesity) బాధపడుతున్నారు. దానిని నుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలు చేసేవారున్నారు. డేవ్ ముర్ఫీ అనే కెనడియన్ తన బరువు తగ్గడం వెనుక 5 ఏళ్ల క్రితం ప్లే గ్రౌండ్ లో తన కూతురితో జరిగిన సంభాషణ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసాడు. ఇప్పడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ గ్రేట్ డాడ్ స్టోరీ మీరు చదవండి.

డేవ్ ముర్ఫీ (Dave Murphy) అల్బెర్టాలోని (Alberta) క్లారెషోమ్ పట్టణంలో (Claresholm town) నివాసం ఉంటున్నాడు. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం తన నాలుగేళ్ల కూతురు ఇంటి నుంచి ప్లే గ్రౌండ్ వరకు పరుగులు తీద్దాం అన్నదట. అప్పుడు డేవ్ 400 పౌండ్ల బరువు ఉన్నాడట. అంటే 180 కేజీలు. ఒక ప్రమాదంలో అతని ఎడమకాలి కండరాలు పనిచేయడం మానేశాయట. ఆ విషయం చిన్నారికి గుర్తొర్చి తండ్రి పరుగులు పెట్టలేడు కదా అని విచారం వ్యక్తం చేసిందట. “నన్ను క్షమించు నాన్నా.. నువ్వు పరుగులు పెట్టలేవు కదా” అన్న కూతురి మాటలు డేవ్ ని ఆలోచనలో పడేశాయి.

Daughter Gift : మొదటి జీతంతో తండ్రికి విలువైన గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. వీడియో వైరల్

1994లో ఒట్టావాలోని (Ottawa) బేషోర్ షాపింగ్ సెంటర్‌లో డేవ్ కి కొందరు వ్యక్తులతో జరిగిన గొడవలో గాయాలయ్యాయి. 13 కత్తిపోట్లకు కూడా గురయ్యాడు. దాంతో అతను నడవలేని స్థితికి చేరాడు. అనేక శస్త్ర చికిత్సలు కూడా జరిగాయి. ఆ తరువాత అతను పోస్ట్ ట్రామాటిక్ (post-traumatic ) స్ట్రెస్ డిజార్డర్ తో కూడా బాధపడ్డాడట. ఈ ఇన్సిడెంట్ తరువాత అతను విపరీతమైన బరువు పెరిగిపోయాడు. అయితే కూతురు అడిగిన ప్రశ్న మళ్లీ అతడిని కదిలించింది. అందరు తండ్రుల్లా తాను కూడా ఎందుకు ఉండలేననే ఆలోచనకు దారి తీసింది. అంతే పట్టుదలగా ప్రయత్నం చేశాడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత 172 పౌండ్లకు బరువు తగ్గాడట. అంటే 77 కేజీల బరువు అన్నమాట. కూతురు అడిగినట్లు ఇంటి నుంచి ప్లే గ్రౌండ్ కి పరుగులు తీస్తున్నాడు..జిమ్ కి వెళ్లి ఎక్సర్ సైజ్ లు చేస్తున్నాడు.

washing machine blast : పేలిన వాషింగ్ మెషీన్ .. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి వీడియో వైరల్

ఈ స్టోరీని డేవ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అతని స్టోరీ చదివిన యూజర్లు గ్రేట్ స్టోరీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కూతురు అడిగిన ప్రశ్నకు.. పట్టుదలతో ప్రయత్నించి మరలా అతను సాధారణ స్థితికి చేరుకున్న తీరు అందరిని ఇన్ స్పైర్ చేస్తోంది.