Girl kindness : వృద్ధుడి కోసం చిన్నారి సాయం .. హృదయాన్ని కదిలించే వీడియో

రోడ్ సైడ్ ఎంతోమంది వృద్ధులు నడవలేని స్థితిలో వెళ్తుంటారు. వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మంచినీరు కూడా తాగలేని ఓ వృద్ధుడిని చూసి ఓ చిన్నారి చలించిపోయింది. వెంటనే ఆమె చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం కదిలిపోయింది.

Girl kindness

పసి పిల్లల్ని దేవుడితో పోలుస్తారు. వారిలో ఎలాంటి కల్మషం ఉండదు. వారి కంటికి ఏదైనా కష్టం కనిపిస్తే వెంటనే స్పందిస్తారు. చేయి వణుకుతున్న ఓ వృద్ధుడు (elderly man) మంచినీరు (water) తాగడానికి ఇబ్బంది పడుతుంటే ఓ చిన్నారి (little girl) అతనికి చేసిన సాయం ఇంటర్నెట్ ను కదిలించింది.

Sweet Dabeli : దబేలీ స్వీట్ కొత్త వెర్షన్.. విచిత్రంగా తయారు చేసిన వ్యక్తి వీడియో వైరల్

రోడ్డు వారగా ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. బాగా దాహం వేసిందేమో మంచినీరు తాగాలని ప్రయత్నిస్తుంటే అతని చేయి వణికిపోతోంది. అటువైపుగా వెళ్తున్న ఓ చిన్నారి ఈ విషయాన్ని గమనించింది. వెంటనే అతని చేతిలోని బాటిలో తీసుకుని తాగడానికి సహాయం చేసింది. ఒక చేత్తో అని వీపుని నిమురుతూ .. మరో చేత్తో అతనికి ఎంతో ఆప్యాయంగా బాటిల్‌తో (bottle) మంచినీరు పట్టించింది. అంతలో ఆ చిన్నారి తండ్రి కాబోలు వచ్చి ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. ఈ వీడియోలో ఆ అమ్మాయి దయాగుణానికి జనం మనసులు కదిలిపోయాయి. ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువకుడు.. విచిత్రంగా చూసిన ప్రయాణికులు

ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసో అని కొందరు.. ఇతరులకు సాయపడటం విషయంలో ఈ చిన్నారిని ఆదర్శంగా తీసుకోవాలని మరికొందరు కామెంట్లు పెట్టారు. పక్కనవాడు ఎలా పోతే మనకెందుకులే అన్నట్లుగా మారిన సంస్కృతిలో ఈ చిన్నారి వీడియో చాలామందిలో కనువిప్పు కలిగించకమానదు.