కరోనావైరస్ లాక్‌డౌన్‌లోని ఓ తల్లి…పాపను ఆడుకోమని అంటే…ఏకంగా ఇంటికి, వంటికి పెయింట్ వేసింది…

  • Publish Date - March 21, 2020 / 08:46 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ప్రాణాంతకమైన వైరస్ భారీన పడ్డకుండా ఉండటం కోసం కొంతమంది తమని తామే స్వీయ నిర్భంధనంలో ఉంచుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్వీయ నిర్భంధనంలో ఉన్న స్కాటిష్ మహిళా పెయింటిగ్ తో కప్పబడిన తన కూతురున్ని వెతికే వీడియో వైరల్ అవుతుంది.

స్కాటిష్ మాజీ క్రీడాకారిణి క్లేర్ డోచెర్టీ స్వీయ నిర్భంధనలో తన కూతురున్ని ఆడుకోమంటే ఇంటి మెుత్తాన్ని పెయిటింగ్ తో నింపేస్తుంది. రెండేళ్ల పాప బాత్రూమ్, కిచెన్, లివింగ్ రూమ్ ను పూర్తిగా పెయిటింగ్ తో నింపేసింది. అంతేకాకుండా తనన్ని తాను పెయిటింగ్ తో పూర్తిగా కవర్ చేసుకుంది. ఆ పెయిటింగ్ పూసుకుని ఇళ్లంతా తిరుగుతూ గందరగోళంగా ఇంటిని మార్చేసింది. డోచెర్టీ కూతురున్ని వెతుకు ఉండగా పెయిటింగ్ తో కప్పబడింది తన కూతురేనని తెలిసి ఎంతో ఆశ్చర్యంగా ఉంది.
 
ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి 10లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. 32 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. పిల్లలు చేసే పనులు ఎంత ఫన్నీగా ఉంటాయి అంటూ నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ కేసులు 2లక్షల 75వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల 10వేల మందికి పైగా మరణాలు సంభవించాయి.

See Also | గాలి కూడా అందడం లేదు, కరోనా బాధితులతో కిక్కిరిసిన ఆసుపత్రులు, ఇటలీలో హృదయవిదారక దృశ్యాలు