శోభనం గదిలోఎన్నికల ప్రచారం : పాలగ్లాసు కాదు ‘జనసేన’ పూల గ్లాస్ 

  • Publish Date - March 18, 2019 / 09:01 AM IST

ఒకపక్క ఎన్నికల సీజన్..మరోపక్క పెళ్లిళ్ల సీజన్. రెండు ముఖ్యమే. ఈ క్రమంలో పెళ్లిళ్లలోనే కాదు ఆఖరికి శోభనం గదిని కూడా ఎన్నికల ప్రచారంగా మార్చేస్తున్నారు. అదేంటంటే.. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసు. ఇప్పుడు ఆ గాజుగ్లాసు కాస్తా శోభనం గదిలో పూల గ్లాసుగా మారిపోయి ప్రచారాస్త్రంగా మారింది.

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. తరువాత శోభనం రోజున తన అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం.. పార్టీపై ఉండే పిచ్చి వెరసి శోభనం గదిలో పాలగ్లాసు కాస్తా పూల గ్లాస్ అయ్యింది. 

శోభనం గదిలో మంచాన్ని పూలతో అందంగా అలంకరిస్తారు. కానీ ఈ పెళ్లికొడుకు కాస్తంత వెరైటీ అన్నమాట.. పైగా జనసేనపై అభిమానాన్ని చాటుకుంటు..శోభనం గదిలో పూలతో జనసేన పార్టీ పేరు.. పార్టీ గుర్తు ‘గ్లాస్‌’ను అలంకరించాడు. ఆ ఫొటోను వాట్సాప్‌లో స్నేహితులతో పంచుకున్నాడు. దీంతో ఆ ఫొటో అలా అలా ఫోన్లు మారుతూ మారుతూ.. వైరల్ అయ్యింది. శోభనం గదిని కూడా ప్రచారానికి వాడుకున్న వీరాభిమానిని ఇదే చూడటం అంటూ కామెంట్ లు పెడుతున్నారు.