Fact Check : భారత్‌లో #Karachi ట్రెండింగ్.. పాక్ నిరసన ర్యాలీలో ఇండియా ఫ్లాగ్ వైరల్!

  • Publish Date - October 23, 2020 / 07:38 PM IST

Karachi Trends In India : ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ ఇండియాలో కరాచీ (#Karachi) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాక్ సిటీలోని కరాచీలో భారీ సంఖ్యలో ర్యాలీలు, నిరసనలు వ్యక్తమయ్యాయి.



ఆ నిరసన ర్యాలీల్లో పలు విపక్ష పార్టీల కూటమిగా ఏర్పడి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవెంట్ (PDM)తో పిలుపునిచ్చాయి.



పాకిస్థాన్ ఆర్మీ సపోర్టుతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడ్డారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల మధ్య పలు పార్టీలు తమ పార్టీ జెండాలతో భారీ ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేస్తాయి. నిరసనల మధ్య అనేక పార్టీల జెండాలు దర్శనమిచ్చాయి. అందులో భారత జాతీయ పతాకం (ఇండియన్ ఫ్లాగ్) కూడా దర్శనమిచ్చింది.



కరాచీలో పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనల్లో కొన్ని జెండాల ఫొటోలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. అందులో ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నట్టుగా కనిపించడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అయితే దీనిపై నిపుణులు .. అది ఇండియన్ ఫ్లాగ్ అసలే  కాదని తేల్చేచెప్పేశారు. పాకిస్థాన్ అవామీ తెహరిక్…(Pakistan Awami Tehreek) PAT పార్టీగా పిలుస్తారు. ఈ పార్టీకి చెందిన జెండాగా నిపుణులు స్పష్టం చేశారు. PAT పార్టీ జెండా అచ్చం భారతీయ జెండా మాదిరిగానే మూడు రంగులతో ఉంది.



వాస్తవానికి అసలు అక్కడ భారతీయ జెండానే లేదు. ఎవరైనా ఫొటోను మార్ఫింగ్ చేసి ఉండొచ్చునని అంటున్నారు.

ఏది ఏమైనా.. ట్విట్టర్ లో కరాచీలో నిరసనలకు సంబంధించి ఈ ఫొటో వైరల్ అవుతోంది. ట్విట్టర్ ఇండియాలో కూడా టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు