Ice Cream Seller Tricks
Ice Cream Seller Tricks : ఐస్ క్రీం అంటే చిన్నపిల్లలు ఎగబడతారు. బయట కనిపిస్తే చాలు కొనమని మారాం చేస్తారు. ఓ చిన్నారి (little girl) ఐస్ క్రీం (ice cream) తిందామని ఓ టర్కిష్ ఐస్ క్రీం అమ్మేవాడి (Turkish Ice Cream seller) బండి దగ్గరకు వచ్చింది. ఇక ఐస్ క్రీం ఊరకనే ఇస్తాడా? రకరకాల ట్రిక్స్ ప్లే చేశాడు. ఆ చిన్నది పాపం బిక్కమొహం వేసింది. ఇంటర్నెట్ లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
boy scary video : 27 అంతస్తుల మధ్య బాలుడి ఫీట్లు.. గుండె ఆగిపోతుందేమో అనిపించే వీడియో వైరల్
ఓ చిన్నారి ఐస్ క్రీం అమ్మేవాడి దగ్గర నిలబడింది. ఇక ఐస్ క్రీం అమ్మేవాడు ట్రిక్స్ (tricks) మొదలుపెట్టాడు. మొదట ఐస్ క్రీం ఇచ్చినట్లు చేసి ఖాళీ కోన్ (empty cone) చేతిలో పెట్టాడు. రెండోసారి అదే ట్రిక్ ప్లే చేశాడు. కోన్ లో ఐస్ క్రీం ఏమైందో అర్ధం కాక ఆ బుజ్జిది బిక్క మొహం చేసింది. అచుట్టూ ఉన్నవారు అతని ట్రిక్స్ కి నవ్వుకున్నారు. ఇక ఆ పసిదాని ముఖం చూసి ఏడిపించకూడదు అనుకున్నాడేమో ఐస్ క్రీంతో కోన్ తిరిగి ఇచ్చాడు. అంతే చిన్నారి ఖుష్ అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది.
Mango-Poori Combination : పాతదే కొత్తగా.. మ్యాంగో జ్యూస్-పూరీ.. వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్
ఇక ఈ వీడియోని చూసినవారంతా చిన్నారి క్యూట్ గా ఉందని.. నవ్వు ఆగట్లేదని.. రకరకాలుగా స్పందించారు. టర్కిష్ ఐస్ క్రీం అమ్మేవాళ్లు ఐస్ క్రీం కోసం వచ్చిన వారిని కాసేపు ఆట పట్టిస్తుంటారు. ఫన్ కోసం ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. చాలాసేపు ట్రిక్స్ ప్లే చేశాకే చేతికి కోన్ అందిస్తారు. ఆ కాసేపు జనం వారి ట్రిక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
She deserves two ice creams atleast 🥺 pic.twitter.com/qxgwFRsBWe
— Godman Chikna (@Madan_Chikna) April 4, 2023