boy scary video : 27 అంతస్తుల మధ్య బాలుడి ఫీట్లు.. గుండె ఆగిపోతుందేమో అనిపించే వీడియో వైరల్

తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే ఎలాంటి సాహసాలైనా చేసేస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. 27 అంతస్తుల భవనంపై ఓ బాలుడి ఫీట్లు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేసాడు?

boy scary video : 27 అంతస్తుల మధ్య బాలుడి ఫీట్లు.. గుండె ఆగిపోతుందేమో అనిపించే వీడియో వైరల్

boy scary video

boy scary video : ఒక్కోసారి ఎత్తైన ప్రాంతాల నుంచి క్రిందకు చూడాలంటేనే భయపడతాం. చివరికి ఎక్కువ ఫ్లోర్లు ఉన్న భవనం పైనుంచి (building) చూడాలన్న భయం అనిపిస్తుంది. అలాంటిది 27 ఫ్లోర్ల మధ్య ఓ బాలుడు చేసిన ఫీట్ గుండె గుభేల్ అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూసి జనం షాకవుతున్నారు.

J’khand: అమ్మాయిల సాహసం.. రాత్రిపూట 17 కిలోమీటర్లు నడిచి వెళ్లిన బాలికలు.. ఎందుకంటే

చైనాలో (China) 27 అంతస్తుల భవనం మధ్య ఇద్దరు అబ్బాయిలు నిలబడ్డారు. అందులో ఒకడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఫ్లోర్ల మధ్య గ్యాప్ లో అటు..ఇటు జంప్ (jumping) చేయడం మొదలుపెట్టాడు. వీడియో చూస్తున్నంత సేపు బాలుడు చేస్తున్న విన్యాసాలు చెమటలు పట్టించాయి. వీరి విన్యాసాలు చూసిన వెంటనే అక్కడ సిబ్బంది అలర్టై వారిద్దరినీ సురక్షితంగా కిందకు దించారట. ఈ వీడియో 2021 నాటిది అయినప్పటికీ తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ను ఓన్లీ బ్యాంగర్స్ (OnlyBangers) అకౌంట్ ద్వారా ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో జనం వీడియో చూసి షాకవుతున్నారు.

Deliver Food Order: ఫుడ్ డెలివరీ చేసేందుకు సాహసం…. 30,000 కిలోమీటర్లు ప్రయాణించి, నాలుగు ఖండాలు దాటిన యువతి

ఈ వీడియోకి ఇప్పుడు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. చూసినవాళ్లు నాకు గుండె ఆగిపోయేలా ఉందని ఒకరు.. ఇంత జరుగుతుంటే ఇంట్లో వాళ్లు ఏం చేస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా పిల్లల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వారిపై ఓ కన్నేసి ఉంచాలని ఈ వీడియో చెబుతోంది.