J’khand: అమ్మాయిల సాహసం.. రాత్రిపూట 17 కిలోమీటర్లు నడిచి వెళ్లిన బాలికలు.. ఎందుకంటే

పాడైన ఆహారం తినమని వేధించడం, టాయిలెట్లు క్లీన్ చేయించడం వంటివి చేయిస్తోంది. అలాగే నేల మీదే చలికి వణుకుతూ పడుకోవాల్సి వస్తోంది. సమస్యల గురించి ఎవరైనా నిలదీస్తే శిక్షించడం, వేధింపులకు గురి చేయడం చేస్తోంది.

J’khand: అమ్మాయిల సాహసం.. రాత్రిపూట 17 కిలోమీటర్లు నడిచి వెళ్లిన బాలికలు.. ఎందుకంటే

J’khand: ఝార్ఖండ్‌లో అమ్మాయిలు సాహసం చేశారు. రాత్రిపూట ఏకంగా 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. తమను వేధిస్తున్న హాస్టల్ వార్డెన్‌పై ఫిర్యాదు చేసేందుకు కొందరు బాలికలు చేసిన సాహసమిది. ఝార్ఖండ్, వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా, కుంత్‌పానిలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఉంది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

ఇక్కడ విద్యార్థినులను హాస్టల్ వార్డెన్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోంది. పాడైన ఆహారం తినమని వేధించడం, టాయిలెట్లు క్లీన్ చేయించడం వంటివి చేయిస్తోంది. అలాగే నేల మీదే చలికి వణుకుతూ పడుకోవాల్సి వస్తోంది. సమస్యల గురించి ఎవరైనా నిలదీస్తే శిక్షించడం, వేధింపులకు గురి చేయడం చేస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఎలా వెళ్లాలో తెలియని వాళ్లంతా చివరకు నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా 11 తరగతి అమ్మాయిలతోపాటు, మరికొంత మంది కలిసి మొత్తం 60 మందికి పైగా అమ్మాయిలు రాత్రంతా నడుచుకుంటూ వెళ్లారు. అత్యంత కష్టమైన, ఎడారి ప్రాంతంలాంటి రోడ్ల మీద 17 కిలోమీటర్లు నడుచుకుంటూ చాయ్‌బస ప్రాంతంలోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

Chandigarh: ఒక్క ఓటు తేడాతో మేయర్ సీటు దక్కించుకున్న బీజేపీ.. చండీగఢ్ మేయర్‌గా అనూప్ గుప్తా

ఉదయం ఏడు గంటల వరకు అమ్మాయిలంతా కలెక్టరేట్ చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల వద్దకు చేరుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని, వార్డెన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రత్యేక కమిటీ నియమించి, హాస్టల్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అర్ధరాత్రి పూట అమ్మాయిలు 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం సంచలనంగా మారింది.