Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తా. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడే.. కానీ, స్నేహం వేరు. రాజకీయాలు వేరు. 2024లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు వస్తాయి. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

Pawan Kalyan: అవసరమైతే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు సినీ నటుడు, వైసీపీ నేత అలీ. తిరుపతి జిల్లా నగరిలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ ఆదేశిస్తే పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం.

Chandigarh: ఒక్క ఓటు తేడాతో మేయర్ సీటు దక్కించుకున్న బీజేపీ.. చండీగఢ్ మేయర్‌గా అనూప్ గుప్తా

సీఎం జగన్ ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తా. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడే.. కానీ, స్నేహం వేరు. రాజకీయాలు వేరు. 2024లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు వస్తాయి. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసు. మంత్రి రోజాను పవన్ డైమండ్ రాణి అన్నారు. డైమండ్ అనేది చాలా పవర్‌ఫుల్’’ అని అలీ వ్యాఖ్యానించారు. ఇటీవలే నటుడు అలీకి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాల ద్వారా పవన్-అలీ మంచి మిత్రులుగా మారారు. అయితే, పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పటికీ అలీ అందులో చేరలేదు.

PM Shehbaz Sharif: గుణపాఠం నేర్చుకున్నాం.. భారత్ ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం

వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌పై అలీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇద్దరిమధ్యా దూరాన్ని పెంచాయి. అలీపై కూడా పవన్ కొన్ని పరోక్ష విమర్శలు చేశారు. దీంతో అప్పటినుంచి పవన్-అలీ కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. పవన్ సినిమాల్లో కూడా కొంతకాలంగా అలీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.