Deliver Food Order: ఫుడ్ డెలివరీ చేసేందుకు సాహసం…. 30,000 కిలోమీటర్లు ప్రయాణించి, నాలుగు ఖండాలు దాటిన యువతి

కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేసేందుకు ఒక అమ్మాయి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా నాలుగు ఖండాలు దాటింది. దాదాపు 30,000 కిలోమీటర్లు ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేసింది.

Deliver Food Order: ఫుడ్ డెలివరీ చేసేందుకు సాహసం…. 30,000 కిలోమీటర్లు ప్రయాణించి, నాలుగు ఖండాలు దాటిన యువతి

Deliver Food Order: ఫుడ్ డెలివరీ అంటే ఎన్ని కిలోమీటర్ల లోపు చేస్తారు? పది.. పాతిక.. యాభై.. వంద. ఈ మధ్య కొత్తగా ఒక సిటీ నుంచి మరో సిటీకి కూడా విమానాల్లో ఫుడ్ డెలివరీ చేసే సర్వీస్ మన దేశంలో కూడా ప్రారంభమైంది.

Elon Musk: బైబై మస్క్ అంటున్న ఉద్యోగులు.. రిప్ ట్విట్టర్ అంటున్న యూజర్లు.. ఆందోళన లేదంటున్న మస్క్

అయితే, ఒక యువతి మాత్రం ఏకంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు 30,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అది కూడా నాలుగు ఖండాలు దాటి ఫుడ్ డెలివరీ చేసింది. సింగపూర్ నుంచి నిర్మానుష్య ప్ర్రాంతమైన అంటార్కిటికా ఖండానికి ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చింది. ఈ ఫుడ్ డెలివరీ జర్నీకి సంబంధించిన వీడియోను ఆ యువతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రకారం గత నెలలో ఆ యువతి సింగపూర్ నుంచి అంటార్కిటికాకు ‘ఫుడ్‌ పాండా’ డెలివరీ సంస్థ తరఫున ఫుడ్ తీసుకెళ్లింది. ముందుగా సింగపూర్ నుంచి విమానం ద్వారా జర్మనీలోని హ్యాంబర్గ్, అర్జెంటినాలోని బ్యూనోస్ ఎయిరెస్ మీదుగా అంటార్కిటికా చేరుకుంది.

FIFA World Cup 2022: రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం.. అక్కడ బీర్ల అమ్మకాలు బంద్

అలాగని ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒక ఖండం నుంచి మరో ఖండానికి వెళ్లేటప్పికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. పూర్తి చలి వాతావరణంలో, మంచు కురుస్తుండగా ప్రయాణించింది. కొన్నిచోట్ల మట్టి, బురద రోడ్లు దాటింది. చాలా కష్టపడి మొత్తానికి ఫుడ్ డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. చాలా మంది ఆ యువతిని అభినందిస్తున్నారు. ఆమె సాహసం, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Maanasa Gopal (@nomadonbudget)