Elon Musk: బైబై మస్క్ అంటున్న ఉద్యోగులు.. రిప్ ట్విట్టర్ అంటున్న యూజర్లు.. ఆందోళన లేదంటున్న మస్క్

ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంస్థ విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా వందలాది ఉద్యోగులు కంపెనీకి రాజీనామా చేస్తున్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆందోళనా లేదంటున్నాడు ఎలన్ మస్క్.

Elon Musk: బైబై మస్క్ అంటున్న ఉద్యోగులు.. రిప్ ట్విట్టర్ అంటున్న యూజర్లు.. ఆందోళన లేదంటున్న మస్క్

Elon Musk: ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత నుంచి అనేక కుదుపులకు లోనవుతోంది. మస్క్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కంపెనీని గందరగోళంలో పడేస్తున్నాయి. ఖర్చులు
తగ్గించుకునేందుకు ఇప్పటికే దాదాపు సగం మంది ఉద్యోగుల్ని తొలగించాడు.

Uttar Pradesh: జవాన్‌ను రైలులోంచి తోసేసిన టీటీఈ.. రైలు కింద పడి కాలు పోగొట్టుకున్న సైనికుడు.. పరిస్థితి విషమం

మిగిలిన ఉద్యోగుల్ని మరింత ఎక్కువ సమయం పని చేయాలని కోరాడు. దీంతో చాలా మంది ఉద్యోగులు ఒత్తిడి భరించలేక రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు బ్లూ టిక్‌కు ఛార్జీలు వసూలు చేయాలనే నిర్ణయాన్ని యూజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగులు, ఇటు యూజర్ల నుంచి ట్విట్టర్ సంస్థ తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులు ‘బైబై మస్క్’ అంటూ రాజీనామాలకు సిద్ధ పడుతుంటే, యూజర్లు మాత్రం ‘రిప్ ట్విట్టర్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే, వినియోగదారులు, ఉద్యోగుల నుంచి కంపెనీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఎలన్ మస్క్ ఏమాత్రం తగ్గడం లేదు.

Pralhad Joshi: కేటీఆర్, కవిత.. బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ఈ పరిణామాలపై తనకు మరీ అంతగా ఆందోళన లేదని మస్క్ అన్నాడు. ‘‘ఉత్తమమైన వ్యక్తులే కంపెనీతో ఉంటున్నారు. అందువల్ల నేను పెద్దగా ఆందోళన చెందడం లేదు’’ అని మస్క్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘రిప్ ట్విట్టర్’ ట్రెండ్ అవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ ఎలా సాగుతుందో అని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.