Uttar Pradesh: జవాన్‌ను రైలులోంచి తోసేసిన టీటీఈ.. రైలు కింద పడి కాలు పోగొట్టుకున్న సైనికుడు.. పరిస్థితి విషమం

జవానుకు, టీటీఈకి మధ్య జరిగిన వాగ్వాదంలో జవాన్‌ను రైలు లోంచి బయటకు తోసేశాడు టీటీఈ. ఈ ఘటనలో జవాన్ రైలు కింద పడి కాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Uttar Pradesh: జవాన్‌ను రైలులోంచి తోసేసిన టీటీఈ.. రైలు కింద పడి కాలు పోగొట్టుకున్న సైనికుడు.. పరిస్థితి విషమం

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్, బరేలీ ప్రాంతంలో దారుణం జరిగింది. ఆర్మీ జవాన్‌ను టీటీఈ రైలులోంచి తోసేయడంతో అతడు కాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం, బరేలిలో దిబ్రూగర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం నెంబర్ 2పై నుంచి బయల్దేరింది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ.. యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు

ఈ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న సోనూ అనే ఆర్మీ జవాన్‌కు, సూపన్ బోరె అనే టీటీఈకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సూపన్ బోరె.. సోనూను రైలులోంచి తోసేశాడు. దీంతో సోనూ రైలు కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కాలు కోల్పోయాడు. వెంటనే అతడిని సమీపంలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఘటన తర్వాత టీటీఈ సూపర్ బోరె కనిపించకుండా పోయాడు.

అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అతడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఘటన తర్వాత కొందరు ప్రయాణికులు టీటీఈపై దాడి చేసినట్లు సమాచారం.