Rahul Gandhi: రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ.. యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా చేరారు. ఆయన శుక్రవారం రాహుల్ గాంధీని కలుసుకుని, పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు రాహుల్‌ను చంపుతామంటూ ఇండోర్‌లో బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ.. యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు

Updated On : November 18, 2022 / 2:54 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఆయనను చంపుతామంటూ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. మహారాష్ట్రలో పర్యటన ముగించుకుబోతున్న రాహుల్.. మధ్య ప్రదేశ్ చేరుకోనున్నారు. రాహుల్ అక్కడికి అడుగుపెట్టక ముందే ఆయనకు ఒక బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది.

BJP MP Arvind Vs MLC Kavitha : నా వ్యాఖ్యలు నిజం కాబట్టే కవిత అంతలా రియాక్ట్ అయ్యారు : బీజేపీ ఎంపీ అర్వింద్

మధ్య ప్రదేశ్ రాజధాని ఇండోర్‌, జుని పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఒక స్వీట్ షాపు వద్ద ఈ లేఖ కనిపించింది. ఈ లేఖలో రాహుల్ ఇండోర్ వచ్చిన వెంటనే వీలైనంత త్వరగా ఆయనను చంపుతామని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లేఖ ఎవరు అక్కడికి చేర్చారు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో శుక్రవారం ఉదయం మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ.. రాహుల్ గాంధీని కలిశారు. బుల్దానా జిల్లాలోని షెగావ్ ప్రాంతంలో యాత్ర సాగుతుండగా, తుషార్ గాంధీ… రాహుల్‌ను కలిశారు. ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు.

BJP MP Arvind Vs MLC Kavitha : ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా’ : బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కవిత ఫైర్..

ఈ అంశంపై తుషార్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘నేను ‘భారత్ జోడో యాత్ర’లో చేరుతున్నాను. షెగావ్ నేను పుట్టిన ప్రాంతం. మా అమ్మ ఈ ప్రాంతం నుంచి రైలులో వెళ్తుండగా, షెగావ్ స్టేషన్‌లో ఆగినప్పుడు 17 జనవరి 1960న ఇక్కడే జన్మించాను’’ అని తుషార్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ-తుషార్ గాంధీ కలయికను కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైన సంఘటనగా అభివర్ణించింది.