Pralhad Joshi: కేటీఆర్, కవిత.. బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.

Pralhad Joshi: కేటీఆర్, కవిత.. బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Pralhad Joshi: తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక, నిరాశకులోనై తమ ప్రజా ప్రతినిధుల ఇండ్లపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ఇంటిపై శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువతిని ముక్కలుగా నరికిన ప్రియుడు

ఈ దాడిని ప్రహ్లాద్ జోషి ఖండించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీలోకి కేటీఆర్.. కవిత.. ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ప్రహ్లాద్ జోషి.. మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని ఆవాస్ యోజన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ అలా చేస్తున్నారా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు. సీఎం కేసీఆర్ అబద్ధాలకు అడ్డులేకుండా పోతోంది.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ.. యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు

గనులపై ఒడిశా రాష్ట్రం లాభాన్ని గడిస్తుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం గనుల మీద వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. రాజకీయాల్లో ఎవరైనా నేతలు ఆరోపణలు చేస్తే.. ఆ నేత దానిపై స్పష్టత ఇవ్వాలి. కానీ, ఇలా దాడులు చేయడం సరైన చర్య కాదు’’ అని ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు.