Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువతిని ముక్కలుగా నరికిన ప్రియుడు

దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య ఘటనలాగే బంగ్లాదేశ్‌లో మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ఒక వ్యక్తి తన ప్రేయసిని ముక్కలుగా నరికి చంపాడు. అయితే, బాధిత యువతి భారతీయురాలు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువతిని ముక్కలుగా నరికిన ప్రియుడు

Bangladesh: ప్రేమించిన అమ్మాయిని ముక్కలుగా నరికి హత్య చేసే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలి అప్తాద్-శ్రద్ధ ఘటన మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. అయితే, బాధిత యువతి భారతీయురాలు కావడం గమనార్హం. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబు బకర్ అనే వ్యక్తి భారతీయురాలైన కవితా రాణి అనే తన ప్రేయసిని ముక్కలుగా నరికి చంపాడు.

Uttar Pradesh: జవాన్‌ను రైలులోంచి తోసేసిన టీటీఈ.. రైలు కింద పడి కాలు పోగొట్టుకున్న సైనికుడు.. పరిస్థితి విషమం

ఈ ఘటన ఈ నెల 5న జరిగింది. అబు బకర్-సప్నా అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ సహజీవనం చేసేవాళ్లు. అయితే, ఈ క్రమంలో అబు బకర్‌కు కవితా రాణి అనే భారతీయ హిందూ యువతి పరిచయమైంది. ఆమెతో కూడా అతడు సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఈ నెల 5న సప్న పని కోసం బయటకు వెళ్లిన తర్వాత కవితా రాణిని తన ఇంటికి పిలిచాడు అబు బకర్. అక్కడ వారి మధ్య సంబంధం గురించి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపం తెచ్చుకున్న అబు బకర్ కవితా రాణి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆమె తల నరికేశాడు. చేతులు కూడా నరికేశాడు. తర్వాత చేతుల్ని డ్రైనేజీలో పడేశాడు. తలను ఒక పాలిథిన్ కవర్లో చుట్టి, దాచి ఉంచాడు. తలలేని మొండాన్ని మరో పెట్టెలో దాచాడు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీని చంపుతామంటూ బెదిరింపు లేఖ.. యాత్రలో చేరిన మహాత్మా గాంధీ ముని మనవడు

తర్వాత అతడి మొదటి ప్రేయసి సప్న రాగా, ఆమెతో కలిసి రూమ్‌కు తాళం వేసి అక్కడ్నుంచి రాజధాని ఢాకా పారిపోయారు. మరుసటి రోజు అబు బకర్‌ను పనిలోకి తీసుకెళ్లేందుకు యజమాని ఫోన్ చేశాడు. కానీ, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తర్వాత అతడి ఇంటికి మరో వ్యక్తిని పంపించాడు యజమాని. కానీ, ఇంటికి తాళం వేసి ఉంది. ఇదంతా ఏదో అనుమానాస్పదంగా అనిపించింది యజమానికి. ఈ విషయాన్ని ఇంటి ఓనర్‌కు చెప్పాడు. దీంతో వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి చూడగా, అందులో తల లేని కవితా రాణి మృతదేహం లభించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. మరుసటి రోజు నిందితుడు అబు బకర్, అతడి ప్రేయసి సప్నను అదుపులోకి తీసుకున్నారు.