వాషింగ్ మెషీన్‌ లో పసివాడు.. అసలేం జరిగిందంటే?

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 05:08 AM IST
వాషింగ్ మెషీన్‌ లో పసివాడు.. అసలేం జరిగిందంటే?

Updated On : December 16, 2019 / 5:08 AM IST

రష్యాకు చెందిన ఓ వ్యక్తి వాషింగ్ మెషీన్‌ లో బట్టలు ఉతుకుతుండగా.. అతడికి అందులో తన కొడుకు ఏడుస్తూ..కనిపించాడు. అంతే అతనికి ఒక్క నిమిషం గుండె జారినంత పనైంది. భయపడుతూ.. వెంటనే వాషింగ్ మిషెన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి ఆ పిల్లడిని బయటకు తీసేందుకు అందులో ఉన్న దుస్తులన్నీ బయటకు తీసి చూశాడు. కానీ అతనికి ఆ పిల్లడు కనిపించలేదు.

అసలు విషయం ఏంటంటే.. అతనికి వాషింగ్ మెషీన్‌ లో ఆ పసివాడు కనిపించలేదు. కరక్ట్ గా చూస్తే అది తన కొడుకు టీషర్ట్ అని.. దాని పై  అతని ఫోటో ప్రింట్ ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.. వాషింగ్ మెషీన్‌ లో పసివాడిని చూడగానే గుండె ఆగినంత పనైంది. అది టీషర్ట్ అని తెలిసే సరికి ఊపిరి పీల్చుకున్నా అంటూ  తెలిపాడు. 

ఇక ఈ పోస్టు చూసిన నెటిజనులు.. మీ ఇంట్లో టీషర్టులు నువ్వే గుర్తుపట్టకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. ఇలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే టీషర్ట్ రివర్స్ తీసి వాష్ చేయండి, అలా చేస్తే టీషర్ట్ ఎక్కువకాలం ఉంటుంది, కలర్ షేడ్ అవ్వదంటూ రకరకాల సలహాలు ఇచ్చారు.