ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను కోతులు ఎత్తుకెళ్లాయి. కరోనా పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతులు అతనిపై దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయింది. అందులో ఓ కిట్‌ను ఓ కోతి కరాకరా నమిలేయగా.. మరో రెండు కిట్లను తీసుకొని ఇతర కోతులు ఇళ్లపై ఉరుకుతున్నాయి.
దీంతో స్థానికులంతా భయంతో వణికిపోతున్నారు. అక్కడివారు చెప్పిన ప్రకారం, జంతువులు ముగ్గురు రోగుల నుండి తీసుకున్న COVID-19 రక్త పరీక్ష నమూనాలను లాక్కొని పారిపోయాయి. ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉండిపోయాయి. ప్రస్తుతం ఆ శాంపిల్స్ కోతుల దగ్గర ఉండడంతో వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న వాటిల్లో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
అయితే ఆ కోతులను త్వరగా పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు. ఇక చాలా సేపటికి పాడైపోయిన ఆ కిట్లను స్వాధీనం చేసుకున్నట్లు మీరట్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ ధీరజ్ రాజ్ AFPకి తెలిపారు. అంతేకాదు గత రెండు నెలలుగా లాక్డౌన్ చర్యలు కోతులను ధైర్యం చేశాయని నమ్ముతారు.