ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాలు దాదాపుగా లాక్ డౌన్ చేయబడ్డాయి. అలా లాక్ డౌన్ చేయబడిన సమయంలో స్పెయిన్ లో పోలీస్ అధికారులు మాత్రం పాటలు పాడుతూ, డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
స్పెయిన్ లో మాజోర్కాకు ప్రాంతంలో లాక్ డౌన్ చేసిన సమయంలో ఆనందాన్ని వ్యాప్తి చేయటం కోసం పోలీస్ అధికారులు రెండు కారులలో సైరన్ మోగిస్తు వచ్చి ఇరుకైన రోడ్డు మధ్యలో ఆగిపోయారు. వాహనాలలో నుంచి గిటార్లను తీసుకుని దిగారు. పోలీసులు గిటార్లను వాయిస్తూ , పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తారు. ఇండ్లలోని ప్రజలు చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేస్తు, ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వీడియోని అడా జొ.మార్చ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోకి దాదాపు ఆరు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 17 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. 5 వేలకు పైగా రీట్వీట్ లు వచ్చాయి.
చైనా , ఇటలీ తరువాత స్పెయిన్ లోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మార్చి 21, 2020 న స్పెయిన్ లో 24 గంటల్లో దాదాపు 5 వేల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
Ni andalucía ni valencia. ❤️ pic.twitter.com/TkctveMUkM
— Ada Jo. March (@adamarch83) March 21, 2020
Excellent stuff
— Taylor (@TaylorTay70) March 22, 2020
Brilliant stuff. Public service at it’s best. Is it a traditional song or something local?
— Tim Ward (@tmw1708) March 22, 2020
Wonderful
— William McGowan (@WilliamMcGowa15) March 21, 2020
It really is. They are amazing.
— Ada Jo. March (@adamarch83) March 21, 2020
See Also | కరోనా పంజా, తెలంగాణలో 33కి చేరిన పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 6 కేసులు