చైనాలోని ఓ స్పా ఉద్యోగులకు ఒళ్లు గగొర్పిడిచే ఘటన ఎదురైంది. 20 కిలోల బరువుండే ఓ భారీ కొండచిలువ స్పా సీలింగ్ నుంచి దబ్బు మంటూ కింద పడింది. ఏం జరిగిందో కాసేపు అక్కడ పనిచేసే ఉద్యోగులకు అర్థం కాలేదు. ఏకంగా ఓ పేద్ద కొండ చిలువను చూసి హడలిపోయారు. బెంబేలెత్తిపోయారు.
వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడంతో అక్కడికి వెళ్లి చుశాడు. 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. పైకి చూడగా ఓ పేద్ద కన్నం కనిపించింది. సీలింగ్ నుంచి కొండ చిలువ పడిందని గుర్తించి వెంటనే స్పా యాజమానికి..పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ భారీ పైనాన్ ను పట్టుకున్నారు.
నవంబర్ 12న జరిగిన ఈ ఘటన గురించి స్పా యజమాని మాట్లాడుతూ.. పది సంవత్సరాలుగా ఈ పాము ఇక్కడే ఉంటుందనీ..స్పా నిర్మాణం జరుగుతున్నప్పుడు..ఇక్కడ కొండచిలువను చూసామని కొంతమంది కార్మికులు తనతో చెప్పారని బహుశా ఆ కొండచిలువ ఇదే అయి ఉంటుందని ..దానిని పట్టుకోవడానికి చాలాసార్లు యత్నించామని.. కానీ అది దొరకలేదని చెప్పాడు. అలా పట్టుకున్న ఆ భారీ పైథాన్‌ను స్థానిక వన్యప్రాణుల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.