ఇదో సూపర్ బైక్.. ముచ్చటపడిన పోలీసులకు నేర్పించిన రైడర్!

  • Publish Date - September 5, 2020 / 04:52 PM IST

సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాదారులను పోలీసులు ఆపడం కామన్.. అదే సూపర్ బైకర్లు అతివేగంతో రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాల బారినపడుతుంటారు.. ఇలాంటి ఘటనలకు నివారించేందుకు పోలీసులు స్పీడ్ గా వెళ్లే బైకర్లకు ఆపుతుంటారు. వారి నుంచి జరిమానాలు విధిస్తుంటారు.. కానీ, రయ్ రయ్ మంటూ రోడ్లుపై దూసుకెళ్లిన ఓ సూపర్ బైకర్ ను ఆపేశారు పోలీసులు.. ఫైన్ కట్టమని అడిగేందుకు కాదు.. బైక్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆపారు..

ఇంతకీ ఈ బైక్ ఎలా నడుస్తుంది? బైక్ మోడల్ ఏంటి? పలు విషయాలను అడిగి మరి తెలుసుకున్నారు.. అంతేకాదు.. సూపర్ బైక్ పై రైడ్ ట్రయల్ కూడా చేసి ముచ్చట తీర్చుకున్నారు.. బైక్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా నడపాలో కూడా ఆ సూపర్ బైకర్ పోలీసులకు నేర్పించాడు..



ఇంతకీ ఆ బైక్ పేరేంటో తెలుసా.. Triumph Tiger 800.. ఇదో అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌. ఎక్కువ దూరం టూర్ వెళ్లే వారికి ఈ బైక్ పర్ ఫెక్ట్ గా ఉంటుంది.. ఇలాంటి బైక్ కనిపించగానే పోలీసులకు ముచ్చటేసింది.. ఈ బైక్ ప్రత్యేకతలేంటో తెలుసుకున్నారు.. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో iamautomotivecrazer షేర్ చేశారు.

ఈ వీడియోలో ఒక పోలీసు నెమ్మదిగా బైక్ దగ్గరగా వెళ్లి దాని ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకుంటున్నట్టుగా చూడొచ్చు.. ట్రయంఫ్ టైగర్ 800 అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ అని బైకర్ చెప్పాడు.. ఇదొక ట్రిపుల్ సిలిండర్ మోటారుసైకిల్ అని పోలీసులకు వివరించాడు. ఓ పోలీసు మోటారు సైకిల్ దగ్గరికి వచ్చి మోడల్ ఎలా ఉందో మరింత పరీక్షగా చూశారు..



రెగ్యులర్ మోటార్‌సైకిల్‌తో పోల్చితే టైగర్ 800 కెపాసిటీ ఉంటుంది. సీటింగ్ కూడా చాలా పెద్దదిగా కనిపిస్తోంది.. రైడింగ్ విషయంలో సాధారణ మోటార్‌ సైకిల్‌కు దీనికి చాలా తేడా ఉంటుంది.. ట్రయంఫ్ టైగర్ వంటి భారీ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ తో ప్రయత్నించవచ్చు.

ఎత్తుగా ఉండటంతో సైడ్ స్టాండ్ ఎక్కి కూర్చోవాలి.. ఇందులోని ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.. అచ్చం రైడర్ మాదిరిగానే పోలీసు కూడా అలానే పైకి ఎక్కి సూపర్ బైక్ పై కూర్చొన్నాడు.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు