Preity Zinta : ప్రీతి జింటాకు చేదు అనుభవం.. కారును వెంబడించిన దివ్యాంగుడు
సినీ స్టార్లకు ఒక్కోసారి అభిమానుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీకి ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Updated on- April 5, 2023 / 05:18 PM IST
Preity Zinta
Preity Zinta : సినిమా స్టార్లతో ఫోటోల (photo) కోసం వారి ఆటోగ్రాఫ్‌ల (autograph) కోసం అభిమానులు ఎగబడుతుంటారు. వారి ఇళ్ల వద్ద నిలబడి ఎప్పుడు బయటకు వస్తారా? వారిని ఒక్కసారైనా చూడాలని తహతహలాడుతుంటారు. తాజాగా బాలీవుడ్ (bollywood) నటి ప్రీతి జింటాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓ దివ్యాంగుడు ఎంత వారిస్తున్నా వినకుండా తన వీలై ఛైర్‌తో ఆమె కారుని ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
బాలీవుడ్ భామ ప్రీతి జింటా (Preity Zinta) ఈ మధ్య సినిమాల్లో కంటే ఐపీఎల్ సీజన్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం టోర్నీలో పాల్గొంటూ తన టీమ్ పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆమె బయటకు వచ్చిన సమయంలో చాలామంది అభిమానులు, ఫోటోగ్రాఫర్లు బయట వేచి ఉన్నారు. అయితే ఇప్పుడు తాను వారికి టైం ఇవ్వలేనని, ఫ్లైట్ కి ఆలస్యం అవుతోందని చెప్పి కారులో కూర్చున్నారు ప్రీతి. అక్కడ ఉన్నవారంతా ఆమె పరిస్థితిని అర్ధం చేసుకున్నారు కానీ.. ఓ దివ్యాంగుడు (disabled man) మాత్రం ససేమిరా వినలేదు. వీలై ఛైర్‌పై (wheel chair) కూర్చుని కారుని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా ఫాలో అవ్వద్దని ప్రీతి రిక్వెస్ట్ చేసినా అతని ఆమె మాట వినలేదని తెలుస్తోంది.
గెలిచిన ఆనందంలో ప్రీతి జింతా బాంగ్రా డ్యాన్స్
అమాయకుడిని పట్టించుకోకుండా ప్రీతి అలా ప్రవర్తించడం సరికాదని కొందరు.. ప్రీతికి యాటిట్యూడ్ ఎక్కువైందని కొందరు రిప్లై చేసారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
