Parineeti Chopra : ఆప్ ఎంపీతో బాలీవుడ్ నటి ప్రేమాయణం నిజమేనా? కంగ్రాట్స్ చెప్పిన మరో ఆప్ ఎంపీ.. వైరల్ అవుతున్న ట్వీట్..

ఇటీవల పరిణీతి చోప్రా, రాఘవ్ ముంబైలో రెస్టారెంట్స్ కి వెళ్తూ మీడియాకు చిక్కారు. ఓ రోజు డిన్నర్ కి, ఓ రోజు లంచ్ కి వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరి ఫోటోలు వైరల్ గా మారడంతో వీరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. బాలీవుడ్ హీరోయిన్.....................

Parineeti Chopra : ఆప్ ఎంపీతో బాలీవుడ్ నటి ప్రేమాయణం నిజమేనా? కంగ్రాట్స్ చెప్పిన మరో ఆప్ ఎంపీ.. వైరల్ అవుతున్న ట్వీట్..

AAP MP Sanjeev Arora Tweeted on Parineeti Chopra and AAP MP Raghav Chadha love goes viral

Updated On : March 28, 2023 / 4:57 PM IST

Parineeti Chopra :  బాలీవుడ్ లో 2011లో ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా(Parineeti Chopra) ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తుంది. ఇక బాలీవుడ్ లో లవ్ అఫైర్స్, డేటింగ్(Dating) రూమర్స్ చాలా కామన్ గా వింటూనే ఉంటాము. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఎవరితో ఒకరితో ముంబైలో(Mumbai) షికార్లు చేస్తూనే కనపడతారు. తాజాగా పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP) చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో(Raghav Chadha) డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

ఇటీవల పరిణీతి చోప్రా, రాఘవ్ ముంబైలో రెస్టారెంట్స్ కి వెళ్తూ మీడియాకు చిక్కారు. ఓ రోజు డిన్నర్ కి, ఓ రోజు లంచ్ కి వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరి ఫోటోలు వైరల్ గా మారడంతో వీరు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. బాలీవుడ్ హీరోయిన్ ఇలా ఓ పొలిటీషియన్ తో రెస్టారెంట్స్ కి తిరుగుతుండటంతో అభిమానులు, జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఇది రూమర్ గా ఉండగానే తాజాగా మరో ఆప్ ఎంపీ వీళ్లిద్దరికీ ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేయడంతో మరోసారి వీరిద్దరూ వైరల్ అవుతున్నారు.

Ravanasura Trailer : ఈ భూమి మీద నన్ను ఆపగలిగేది ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే.. రావణాసుర ట్రైలర్ రిలీజ్..

ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా తాజాగా తన ట్విట్టర్ లో.. ఎంపీ రాఘవ్ చద్దాకి, పరిణీతి చోప్రాకు కంగ్రాట్స్. మీ ఇద్దరు ప్రేమ, సంతోషంతో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరికీ నా ఆశీర్వాదాలు అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అసలు వారిపై వచ్చిన రూమర్స్ మీద వాళ్ళు స్పందించకముందే ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆప్ ఎంపీ ఇలా ట్వీట్ చేయడంతో ఇది ఫిక్స్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అందుకే అఫిషియల్ గా పోస్ట్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది వాళ్ళు ప్రేమలో ఉన్నారని చెప్పారా? మీరెందుకు ముందే పోస్ట్ చేశారు, ఇది నిజమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రూమర్స్ పై స్పందించకపోయినా పరిణీతి, రాఘవ్ ఈ ట్వీట్ కి అయినా స్పందిస్తారేమో చూడాలి.