అందాల పోటీల్లో పాల్గొన్న ఏనుగులను ఎప్పుడైనా చూశారా..? కనీసం ఏనుగులు ర్యాంప్ వాక్ చేస్తాయని తెలుసా.. అయితే వయ్యారంగా తిప్పుకుంటూ నడిచే ఏనుగులను ఇప్పుడు చూడండి. నేపాల్‌లోని సౌరహా ప్రతీ ఏటా ఎలిఫ్యాంట్ ఫెస్టివల్ సందర్భంగా ఏనుగులకు అందాల పోటీలు నిర్వహిస్తారు. ఇది 16వ ఎలిఫ్యాంట్ ఫెస్టివల్.
ఇందులో మొత్తం ఐదు ఏనుగులు పార్టిసిపేట్ చేశాయి. వయ్యారంగా ర్యాంప్ వాక్ చేసి జడ్జ్‌లను ఆకట్టుకున్నాయి. ఈ వేడుక చూసేందుకు వందలాది మంది పర్యాటకులు విచ్చేశారు. ఇందులో విజేతగా నిలిచే ఏనుగుకు చెరకు, అరటి పండ్లు, బొప్పయి వంటి రుచికరమైన ఆహారాన్ని బహుమతిగా అందిస్తారు.
ఏనుగులకు, మనుషులకు ఉండే అనుబంధాన్ని తెలిపేందుకు, ఏనుగుల జాతిని కాపాడాలనే సందేశాన్ని తెలిపేందుకు ఏటా ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ 16వ ఎలిఫ్యాంట్ ఫెస్టివల్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.