మీరు దళితులు.. మీకు రాజకీయాలెందుకు..?

  • Publish Date - February 20, 2019 / 03:49 AM IST

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా చెప్పుకునే తెలుగుదేశం నాయకులలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు.  దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చింతమనేని విమర్శల పాలయ్యారు. చింతమనేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినట్లు తెలుస్తుంది. నాటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ గా మారింది. 

రాజకీయంగా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు దళితులు. మీరు వెనుకబడిన వారు. మీరు షెడ్యూల్‌ క్యాస్ట్‌ వారు. రాజకీయాలు మాకుంటాయి. మాకే పదవులు. మీకెందుకురా కొట్లాట.. అంటూ చింతమనేని దళితులను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయగా.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో చింతమనేనిపై నెటిజన్లు, దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం విశేషం. అయితే దీనిపై తెలుగుదేశం నాయకులు కానీ, చింతమనేని ప్రభాకర్ కానీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.