Longest nose
Longest nose : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? 300 ఏళ్లలో అతను నెలకొల్పిన రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేదట.. అతని గురించి చదవండి.
NTR – Pranathi : చార్మినార్ వద్ద ఎన్టీఆర్ భార్య ప్రణతి షాపింగ్.. ఫోటో వైరల్!
థామస్ వాడ్‌హౌస్ అకా థామస్ వెడర్స్ (thomas Wadhouse aka Thomas Wedders)అనే వ్యక్తి 18వ శతాబ్దానికి చెందినవాడు. అతను సర్కస్ లో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడట. 1770లలో ఇతను ఇంగ్లాండ్‌లో (england) నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విషయం ఏంటటే 7.5 అంగుళాల అత్యంత పొడవైన ముక్కుతో ఇతను ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజా నివేదికల ప్రకారం 300 సంవత్సరాల్లో ఇతని రికార్డును ఎవరూ బీట్ చేయలేకపోయారట. లండన్‌లోని (london) రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో (Ripley’s Believe It Or Not Museum) ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగిన వ్యక్తిగా అతని మైనపు విగ్రహాన్ని అక్కడ ఉంచారట. ఇక థామస్ వాడ్‌హౌస్ చిత్రం తాజాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. కొందరు అతను ముక్కుతో అబద్ధాలను పసిగట్టగలడు అని.. అది ముక్కు కాదు ట్రంక్ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
KTR : మంత్రి కేటీఆర్ స్వీట్ మెమరీస్.. చిన్ననాటి ఫోటో వైరల్
ఇక జీవించి ఉన్న జాబితా ప్రకారం చూస్తే ప్రపంచంలో అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తిగా టర్కీకి చెందిన మెహ్మెట్ ఓజురెక్ (Mehmet Ozurek) రికార్డు నెలకొల్పాడు. అతని ముక్కు 3.46 అంగుళాలు. అయితే ఇప్పటి వరకూ థామస్ వాడ్‌హౌస్ రికార్డును మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేకపోవడం విశేషం.
Today he holds the Guinness World Record for having the longest nose, and a wax replica of his head is even on display at London’s Ripley’s Believe It Or Not museum. pic.twitter.com/C6k55iOi7v
— Pubity (@pubity) April 15, 2023