లాక్‌డౌన్‌లో బైటకొస్తున్నారని, ఇండోనేషియా ప్రజలను భయపెడుతున్న దెయ్యాలు…

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 09:48 AM IST
లాక్‌డౌన్‌లో బైటకొస్తున్నారని, ఇండోనేషియా ప్రజలను భయపెడుతున్న దెయ్యాలు…

Updated On : April 27, 2020 / 9:48 AM IST

ఇండోనేషియా Kepuh గ్రామంలోని ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. అక్కడ రాత్రిపూట దెయ్యాలు తిరుగుతున్నాయి. ఆ దయ్యాల పేరే కరోనా దెయ్యాలు. అసలు విషయం ఏంటంటే, ఈ గ్రామంలో ప్రజలను బయటికి  రాకుండా భయపెట్టాలని ఆలోచనతో దెయ్యాల రూపంలో కొంతమందిని నియమించారు. 

ఇండోనేషియా జానపద కథల్లో దెయ్యాలను పోకాంగ్ గా పిలుస్తారు. వీటిని ఎక్కువగా నమ్ముతారు అంటే ముసుగులో చిక్కుకున్న చనిపోయిన వ్యక్తి ఆత్మ అని వారి నమ్మకం. అందుకే వారిని భయపెట్టడానికి కొంతమంది వాలంటీర్లు ముసుగు ధరించి ప్రజలను ఇళ్ల వైపు పరుగులు తీసేలా చేస్తున్నారు. 

 

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ…సామాజిక దూరం మంచి పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. ఇండోనేషియాలో ఇప్పటికే 4వేల281 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 373మంది చనిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది అనే భయంతో…ఎలాగైనా… ప్రజలను రోడ్లమీదకు రాకుండా చేయడానికే ఈ ప్రయత్నం. చైనా తర్వాత ఆసియాలో అత్యధిక కరోనా వైరస్ మరణాలు ఉన్నందున.. Kepuh గ్రామాన్ని కొన్ని సంఘాలు తమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. 

యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా రీసెర్చ్ ప్రకారం… మే నాటికి 140,000 మరణాలు, 1.5 మిలియన్ కేసులు వచ్చే అవకాశం ఉందని తేలింది. అందుకే కరోనావైరస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ దేశాలలో రకరకాల పద్ధతులను అనుసరిస్తున్నారు.