Viral Video : కూతురంటే ఎంత ప్రేమో.. ఆ తండ్రి ఏం చేసాడో చూడండి

కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. వీరి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. విధులకు హాజరవుతున్న కూతురికి గోరుముద్దలు తినిపిస్తున్న ఓ తండ్రి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video

Viral Video : కుటుంబంలో తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. నాన్నకి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. ఇంటర్నెట్‌లో ఓ తండ్రీకూతురి వీడియో వైరల్ అవుతోంది. మనసుని హత్తుకుంటోంది.

Reunited By Facebook : 58 ఏళ్ల తర్వాత..తండ్రీ కూతుళ్లను కలిపిన ఫేస్ బుక్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పూజా బిహానీ శర్మ(poojabihani29andbrijlalbihani) ఇండిగోలో కంటెంట్ క్రియేటర్, లీడ్ క్యాబిన్ అటెండెంట్ అని ఆమె ప్రొఫైల్ చెబుతోంది. రీసెంట్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. డ్యూటీకి వెళ్లడానికి ముందు ఆమె అద్దం ముందు నిలబడి మేకప్ చేసుకుంటుంటే ఆమె తండ్రి అన్నం తినిపిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో అందరి మనసుల్ని కట్టిపడేసింది.’నాన్నా..నువ్వే నా బెస్ట్. నీ గురించి ఇప్పటివరకూ సరిగా చెప్పలేదు. ఈరోజు చాలా చెబుతున్నాను. ప్రతిదానికి ధన్యవాదాలు నాన్నా.. నువ్వు ఎక్కడుంటే అదే నా ఇల్లు.. ఐ లవ్ యూ పాపా’ అనే శీర్షికతో పూజా బిహానీ శర్మ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Emotional Video : అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు ఏం చేసిందంటే?

‘తండ్రి స్ధానాన్ని ఎవరూ తీసుకోలేరు’ అని ఒకరు..’నేను కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడల్లా అమ్మ కూడా ఇలాగే అన్నం పెడుతుంది’ అని మరొకరు వరుసగా కామెంట్లు పెట్టారు. తల్లిదండ్రులతో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.