కళ్లని మాయ చేసే ఫొటోలు చాలా చూసి ఉంటాం. కానీ, ఈ ఫొటో ప్రత్యేకంగా నిలిచింది. అందుకే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందులో ఉన్న ఛాలెంజ్‌ను గుర్తు పట్టకుండా చేస్తుంది. ఛాలెంజ్ చేధించలేని వాళ్లు ఇది వట్టి ట్రాష్ అని జోక్‌లు వేయొద్దని అంటున్నారు. అసలు ఛాలెంజ్ ఏంటో తెలుసా.. ఈ ఫొటోలో ఓ చిరుతపులి ఉంది దానిని కనిపెట్టండి అని.
బెల్లా లాక్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘ఇది నాకు ఒకరు పంపి ఇందులో చిరుతపులిని కనిపెట్టండి. అది కనిపెట్టేంత వరకూ తికమకపడ్డా. ఒక జోక్ అనుకున్నా. నేను కనిపెట్టా. మీరు చేయగలరా’ అని ఛాలెంజ్ చేశాడు. ఈ ఫొటోలో గమ్మత్తేంటంటే బాగా పరిశీలిస్తేనే గానీ, అందులో చిరుతపుట్టి ఉందని తెలీదు. సమాధానం తెలియకపోయినప్పటికీ షేర్ చేసేస్తున్నారు.
ఆసక్తి రేపుతున్న ఛాలెంజ్ ను స్వీకరించిన చాలా మంది కనిపెట్టి సోషల్ మీడియాలో రీ పోస్టు చేయడం మొదలుపెట్టారు. నల్లని మచ్చలతో చిరుత కెమెరాను చూస్తూ పడుకుని ఉన్న ఫొటోను మార్క్ చేసి పోస్టు చేస్తున్నారు. సమాధానం కూడా వైరల్ గా మారుతుండటంతో మళ్లీ ఛాలెంజ్ చేసిన వ్యక్తే దయచేసి ఫొటోలో చిరుతని మార్క్ చేసిన ఫొటోను వైరల్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ఛాలెంజ్‌లో మీరు గెలవగలరా.. ట్రై చేయండి.
Someone just sent this to me and asked me to find the leopard. I was convinced it was a joke… until I found the leopard. Can you spot it? pic.twitter.com/hm8ASroFAo
— Bella Lack ? (@BellaLack) September 27, 2019
Sorry I can’t find the original tweet to credit the photographer, but this is a tricky one also ? pic.twitter.com/HdZUQWMPij
— Birdy (@GeoffBirdy) September 27, 2019
Good camouflage? pic.twitter.com/T88dg9Gzzj
— ღεℓąηḯε (@MJMcCune) September 27, 2019