గంటలకొద్దీ జిమ్‌లో గడిపే వాళ్లు ఈ కూలీ ఫొటో చూడాల్సిందే..

Viral Photo: ఫిట్‌నెస్ కోసం ఆరాటపడే వాళ్లు వేలల్లో ఖర్చు పెట్టి గంటలకొద్దీ జిమ్ లలో బెస్ట్ ట్రైనర్ల సహాయంతో కష్టపడుతుంటారు. వారంతా ఈ రోజు కూలీ ఫొటో చూస్తే ఖర్చు పెట్టిన డబ్బును చూసి వాళ్లకు వాళ్లే జాలిపడాల్సిందే. నెల ఆదాయం కోసమే కష్టపడే కూలీల ఫిట్‌నెస్ డైలీ జిమ్ కు వెళ్లేవారిలో కూడా ఉండదేమో మరి.

రోజంతా కష్టపడి పనిచేసే వారి శరీరం స్ట్రాంగ్ గా సరైన బ్యాలెన్స్‌ కలిగి ఉండటం సహజం. అటువంటి వర్కర్ ఫొటోనే ఒకటి వైరల్ అయింది.



సత్యప్రకాశ్ అనే వ్యక్తి తీసిన ఫొటోను ఆశిశ్ సాగర్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. నిజానికి ఈ వ్యక్తి భవన కార్మికుడు. జిమ్ కు వెళ్లే వారి శరీరంలాగే అతని బాడీ తయారైంది. వేల కొద్దీ రూపాయలు ఖర్చు పెట్టి జిమ్నాయిజమ్స్, ట్రైనర్లు, ఎక్విప్‌మెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్స్ వంటివి ఖర్చు పెట్టకుండా వందల్లో సంపాదన కోసం కష్టపడిన కూలీ ఫొటో ఇది.

ఇంకా ఈ ఫొటో పోస్టు చేసిన సాగర్ కామెంట్ చేస్తూ.. రోజువారీ కూలీ వ్యక్తి కేవలం చపాతీలు, ఉప్పు, అల్లం, మిర్చి, ఉల్లిపాయ తిని ఇలాంటి ఫిజిక్ సంపాదించాడు. స్పెషల్ డైట్ ఫాలో అయి తయారుచేయాలనుకునే శరీర ఆకృతిని అలాంటివేమీ లేకుండానే సంపాదించాడంటూ పోస్టు చేశాడు.
https://10tv.in/how-to-delete-iphone-photos-to-save-space-without-losing-them-forever/
అతను డబ్బు సంపాదించడం కోసం చెమట చిందిస్తుంటే.. చెమట చిందించడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు లగ్జరీ బాబులు. ప్రపంచంలోని అన్ని పొగడ్తలకు ఈ రోజుకూలీ అర్హుడే అని రాసుకొచ్చాడు.

ఇక నెటిజన్లు ఆ ఫొటో చూసి ఊరుకుంటారా.. శ్రామికుడ్ని తెగ పొగిడేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.