Viral video
Viral video: సముద్రంలో లెక్కకు మించిన జీవులు ఉంటాయి. వాటిలో చేపలపై భీకరంగా దాడి చేసే జీవులూ ఉంటాయి. తిమింగళాలు, షార్క్ వంటివి వాటిని సముద్రపు ఒడ్డున చూస్తే భయపడిపోతాం. అటువంటి వీడియోనే తాజాగా ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 15 క్షణాల నిడివితో ఈ వీడియో ఉంది. రెండు తిమింగళాలు ఒకేసారి ఒడ్డుకు వచ్చాయి.
సీల్ అనే సముద్ర జంతువును వేటాడాలనుకున్నాయి. అయితే, సీల్ చాలా తెలివిగా ఒడ్డు చివరనే నిలబడి తప్పించుకోగలిగింది. అదే నీటిలో అయితే దాన్ని ఆ రెండు తిమింగళాలు తినేసేవి. ఒడ్డున ఉన్న దాని మీదకు దూసుకెళ్లితే ఇసుకపై పడే అవకాశం ఉండడంతో ఆఇ రెండు తిమింగళాలు వెనకడుగు వేసి తిరిగి నీళ్లలోకి వెళ్లిపోయాయి.
దీంతో సీల్ ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఈ సీల్ తెలివి తేటలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని సముద్రపు జంతువులూ ఇలాగే ఆలోచిస్తూ తిమింగళాలకు ఆహారం దొరకడం కష్టమేనని కొందరు కామెంట్లు చేశారు. ఈ రెండు తిమిళింగాలు ఒడ్డుకు చేరుకున్న తీరు చాలా భయంకరంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
Seal safe on land. pic.twitter.com/re2EeCSSjt
— Weird and Terrifying (@weirdterrifying) January 3, 2023
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అచ్చం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి