లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. వర్కౌట్స్ నుంచి వంట చేయడం వరకు అన్ని పనుల తాలూకు వీడియోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
తాజాగా పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో ఆకట్టుకునే విష్ణు ప్రియకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇటీవల ఓ డ్యాన్సింగ్ వీడియో షేర్ చేసింది విష్ణు ప్రియ.
మాంచి ఊపు మీద పాటకు అంతే ఎనర్జీగా స్టెప్స్ వేసి మతి పోగొట్టింది. ఇక ఆ నడుము తిప్పుడు, మూమెంట్స్ చేసేటప్పుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. ‘విష్ణు ప్రియలో ఇంత టాలెంట్ ఉందా’.. ‘తెలుగమ్మాయిని గుర్తించండి, ఎంకరేజ్ చేయండి’.. ‘విష్ణు ప్రియ చితక్కొట్టేశావ్’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.