Stunning Fireball: ఆకాశంలో వింత.. మండుతూ దూసుకువెళ్లిన ఖగోళ వస్తువు.. వీడియో

ఉల్కలాంటి ఓ వస్తువు మండిపోతూ ఆకాశంలో దూసుకు వెళ్లింది. స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతంలో చిన్నపాటి అగ్నిగోళంలాంటి ఆ వస్తువు కదులుతూ కనపడగా కొందరు ఈ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. యూకేలోని మీటీయా నెట్ వర్క్ కూడా తమ ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. ఆకాలంలో అగ్నితో కూడిన ఆ వస్తువు దూసుకు వెళ్లడాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

Stunning Fireball: ఉల్కలాంటి ఓ వస్తువు మండిపోతూ ఆకాశంలో దూసుకు వెళ్లింది. స్కాట్లాండ్, ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతంలో చిన్నపాటి అగ్నిగోళంలాంటి ఆ వస్తువు కదులుతూ కనపడగా కొందరు ఈ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. యూకేలోని మీటీయా నెట్ వర్క్ కూడా తమ ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. ఆకాలంలో అగ్నితో కూడిన ఆ వస్తువు దూసుకు వెళ్లడాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఖగోళానికి సంబంధించిన ఆ వస్తువు ఓ రాకెట్ లా కనపడిందని కొందరు చెప్పారు. గత రాత్రి 9-10 గంటల మధ్య ఆకాశంలో ఈ వింత కనపడిందని తెలిపారు. ఈ దృశ్యాలను తమ కెమెరాలో బంధించినందుకు కొందరు సంబరపడిపోయారు. తమకు కొన్ని శబ్దాలు కూడా వినపడ్డాయని కొందరు చెప్పారు. అది ఖగోళం నుంచి భూ వాతావరణంలోకి వచ్చిందని తెలిపారు.

గ్లాస్గో, ఎడిన్‌బర్గ్, ఐర్‌షైర్, ఐర్లాండ్ ప్రాంతాల్లోనూ ఇది కనపడిందని అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అది ఖగోళ వస్తువా? అంతరిక్ష శకలమా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని యూకేలోని మీటీయా నెట్ వర్క్ చెప్పింది.

Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదు

ట్రెండింగ్ వార్తలు