18 years Love Letter : 18 ఏళ్ల క్రితం భర్త రాసిన ప్రేమలేఖను బయట పెట్టిన భార్య…
సాధారణంగా ప్రేమలేఖల్లో ప్రేమికులు వారి మనసులోని భావాలను పంచుకుంటారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన ప్రేమలేఖను భార్య బయట పెట్టడంతో ఈ ప్రేమలేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published on- April 5, 2023 / 11:13 AM IST
18 years Love Letter
18 years Love Letter : ఒకప్పుడు ప్రేమికులు (lovers) తమ మనసులోని భావాల్ని పంచుకోవడానికి ప్రేమలేఖలు (love letters) రాసుకునేవారు. అవి ఒకరి నుంచి ఒకరికి చేరడానికే చాలా కష్టపడాల్సి వచ్చేది. అప్పట్లో వారి మధ్య కమ్యూనికేషన్ ప్రేమలేఖలే మరి. కాలంతో పాటు ప్రేమికులు టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు చేతిలో మొబైల్ ఉండగా చేతిరాతలతో పని ఏం ఉంది? విషయానికి వస్తే ఓ మహిళ 18 ఏళ్ల క్రితం తన భర్త రాసిన ప్రేమ లేఖను బయటపెట్టింది. ప్రేమ లేఖ అనగానే అందులో ఏం రాసి ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ లేఖలో అసలు ఏం ఉంది?
సాయి స్వరూప @Sai_swaroopa అనే మహిళ 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన లవ్ లెటర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె ఇల్లు శుభ్రం చేస్తుంటే 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన లెటర్ ఒకటి బయటపడిందట. ఆ సమయంలో అతను ME.IISc చదువుతుంటే తను BE చదువుతోందట. ఆ టైంలో తన భర్త ఉత్తరాలు రాస్తుండేవాట. ఆ ఉత్తరాల్లో ఎక్కువగా తన చదువుకి సంబంధించి లేదా ప్రయోగాలకు (experiments) సంబంధించిన వివరాలే ఎక్కువగా ఉండేవట. ఆమె పోస్ట్ చేసిన లేఖలో కూడా మనకు అదే కనిపిస్తుంది.
Pitbull Dog: ఓనర్ను చంపిన కుక్క.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రేమికులు
ఎక్కడైతే ప్రయోగం జరుగుతోందో ఆ ప్రాంతానికి తన స్నేహితులు అడిగినప్పుడు వెళ్లకుండా ఉండలేకపోయానని.. మరోవైపు నిద్ర వస్తున్నా సరే ప్రయోగంలో యాక్టివ్ గా పాల్గొన్నానని ఆమె భర్త ఉత్తరాన్ని మొదలుపెట్టాడు. అక్కడ 25 కేజీల ట్రక్ బ్యాటరీ (truck battery) ఎత్తినపుడు అతనికి కలిగిన ఇబ్బందిని కూడా రాశాడు. ఇక ఆ ప్రయోగానికి సంబంధించిన వివరణ మొత్తం ‘ది ఎక్స్పెరిమెంట్’ (the experiment) అనే హెడ్డింగ్ తో రాసుకొచ్చాడు. సాధారణంగా ప్రియురాలికి రాసే లేఖలో ఆమె పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాస్తారు. కానీ తన చదువు, చేసే ప్రయోగాలు వంటివి ఇంత వివరణగా అతను లేఖ రాయడం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక అతని నుంచి ప్రేమలేఖలు అందుకున్న సాయి స్వరూపని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రేమ లేఖల్లో ఇలాంటి అంశాలు ఎక్స్ పెక్ట్ చేయడం అరుదు కాబట్టి. ఎంతో ఓపికగా అతని ఉత్తరాలు రిసీవ్ చేసుకుని ఇన్ని సంవత్సరాలు గడిచినా వాటిని భద్రంగా దాచుకుని ఇలా పోస్ట్ చేసిన సాయి స్వరూపని ట్విట్టర్ లో జనం మెచ్చుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
