Rupert Murdoch: వృద్ద ప్రేమికుల నిశ్చితార్దం రద్దు.. రూపర్ట్ మర్దోక్, ఆన్‌‌ లెస్లీ స్మిత్ మధ్య ఏం జరిగిందంటే?

ప్రపంచ మీడియా దిగ్గజం 92ఏళ్ల రూపర్ట్ మర్దోక్, శాన్ ఫ్రాన్సిస్కో మాజీ పోలీసు చాప్లిన్ 66ఏళ్ల ఆన్ లెస్మీ‌ స్మిత్ గత నెల17న వివాహం చేసుకొనేందుకు నిశ్చితార్దం చేసుకున్నారు. ఈ వేసవిలో వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే నిశ్చితార్ధం జరిగిన నెల గడవక ముందే వారిద్దరూ వేరువేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిశ్చితార్ధం రద్దు చేసుకున్నారు.

Rupert Murdoch: వృద్ద ప్రేమికుల నిశ్చితార్దం రద్దు.. రూపర్ట్ మర్దోక్, ఆన్‌‌ లెస్లీ స్మిత్ మధ్య ఏం జరిగిందంటే?

Rupert murdoch and ann lesley smith

Rupert Murdoch: ప్రపంచ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ – అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch)కు 92ఏళ్ల వయస్సు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న అతను నలుగురికి విడాకులు ఇచ్చేశాడు. ఇటీవల తన ప్రేయసి 66ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith)తో పెళ్లికి సిద్ధమయ్యాడు. వీరికి గత నెల 17న న్యూయార్క్‌లో ఎంగేజ్మెంట్ (Engagement)కూడా జరిగింది. వేసవి కాలంలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారి ఎంగేజ్మెంట్ రద్దయినట్లు తెలుస్తోంది. మర్దోక్ సన్నిహితులు ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. తన ప్రేయసి ఎం.ఎస్. స్మిత్ అభిప్రాయాలతో అతను అసౌకర్యానికి గురయ్యాడని, దీంతో వారి నిశ్చితార్ధం రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

Rupert Murdoch divorce : 91 ఏళ్ల వయసులో మీడియా మొఘల్ 4వ విడాకులు..

ఈ ఏడాది మార్చి 17న జరిగిన ఎంగేజ్మెంట్ సమయంలో తనకు ఇది చివరి పెళ్లి అని, నాకు చాలా సంతోషంగా ఉందని మర్దోక్ చెప్పాడు. నిశ్చితార్ధం సమయంలో డైమండ్ రింగ్‌ను తన ప్రేయసి స్మిత్‌కు అందించాడు. న్యూయార్కులో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారు. 92ఏళ్ల రూపెర్ట్ మర్దోక్ ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట పెట్రిసియా బుకర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 1960 చివరిలో ఆమెకు విడాకులు ఇచ్చాడు, ఆ తరువాత అన్నా మరియా మన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె వార్తాపత్రిక రిపోర్టర్. వీరిద్దరు 30ఏళ్లకుపైగాకు కలిసి జీవించారు. 1999లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.

Donald Trump: నేను దోషిని కాదు..! ప్రపంచం మన దేశాన్ని చూసి నవ్వుతోంది.. డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, విడుదల

ఆ తరువాత వెండీ డెంగ్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2013లో విడాకులు ఇచ్చాడు. 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్న మర్దోక్ గతేడాది ఆగస్టు నెలలో ఆమెకుసైతం విడాకులు ఇచ్చాడు. కొద్దికాలానికి 92ఏళ్ల వయస్సులో 66ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్‌తో ప్రేమలో పడ్డాడు. అన్‌లెస్లీ స్మిత్ భర్త కూడా ప్రముఖ వ్యక్తి. 2009లో ఆయన చనిపోయాడు.