Snake hug వైరల్ వీడియో: పదడుగుల పైథాన్ చుట్టేస్తే.. పిల్లిని కాపాడేందుకు యువతి సాహసం

  • Publish Date - October 26, 2020 / 08:14 AM IST

Woman Rescued From 10ft Python: పిల్లిని కాపాడటానికి ఓ యువతి చేసిన ప్రయత్నం.. ప్రయత్నమే కాదు సాహసం కూడా.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చాలా వైరల్ అవుతోంది. ఓ మహిళ పైథాన్ భారి నుంచి తన పిల్లిని రక్షించడానికి ప్రమాదమైనా కూడా ప్రయత్నించింది.



ఇంతలో, పైథాన్ పిల్లిని వదిలేసి నేరుగా మహిళ కాలును లక్ష్యంగా చేసుకుని గట్టిగా పట్టుకుంది. పైథాన్ పట్టు బలంగా ఉండడంతో ఆ మహిళ పోలీసులను పిలవవలసి వచ్చింది. ఈ Python సుమారు 10 అడుగుల పొడవు ఉంది.



https://10tv.in/video-of-robot-pulling-a-rickshaw-goes-viral/
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు మహిళను పైథాన్ భారి నుంచి విడిపించి.. రెస్క్యూ ఆపరేషన్ వీడియోను సోషల మీడియాలో పంచుకున్నారు. అందులో, కాలును చుట్టిన పైథాన్‌ను పోలీసులు తొలగించడం కనిపిస్తుంది.



ఈ పైథాన్ మహిళ పెంచుకునేది అని పోలీసులు పెంచుకునేది అని భావించగా.. కాదని, అడవి నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు. అయితే మహిళ కూడా అస్సలు భయపడలేదు. పైథాన్‌ను వదిలించి అడవిలో వదిలిపెట్టడం ఆమె పోలీసులకు సహకరించారు.