AP Heatwaves: ఇటు ఎండలు, అటు వానలు.. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. మరో 3 రోజులు

కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల తీవ్ర ఎండలు ఉండనున్నాయని వెల్లడించింది.

  • Published on- May 5, 2026 / 07:16 PM IST

AP Heatwaves: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఓవైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడిగాలులు వణికిస్తున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలమిని తలపిస్తోంది. మరోవైపు వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో మరో మూడు రోజులు కొనసాగనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల తీవ్ర ఎండలు ఉండనున్నాయని వెల్లడించింది.

వర్ష సూచనలు:
* మే 6 (బుధవారం): ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.
* మే 7 (గురువారం): కోస్తా, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో వర్షాలు.
* మే 8 (శుక్రవారం): ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు.

హెచ్చరికలు:

ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద నిలబడరాదు. సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకోవాలి.

ఎండల అలర్ట్:

* గోకవరం, జగ్గంపేట, చింతూరు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం
* పలు జిల్లాల్లో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి

గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు:

* బనగానపల్లి – 43°C
* కొమ్మిపాడు – 42.7°C
* విజయవాడ తూర్పు – 42.3°C
* కంభం – 42.2°C
* పులివెందుల – 42°C

మొత్తం 9 జిల్లాల్లో 45 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రైతులకు సూచన:

పిడుగులు, ఎండల ప్రభావం దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు పాటించాలి.

Also Read: తమిళనాడులో చరిత్ర సృష్టించిన తెలుగు ఎమ్మెల్యే.. టీవీకే నుంచి ఘన విజయం