Telangana Rains : ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్-వచ్చే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు

తెలంగాణలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.

Telangana Rains : తెలంగాణలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. వీటితోపాటు ఉపరితల ద్రోణులు కూడా చురుగ్గా కదులుతున్నాయని…వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని… మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశామని అన్నారు రికార్డు స్ధాయిలో నిజామాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని ఆమె వివరించారు. హైదరాబాద్ లో నిన్నటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని… ఈరోజు కూడా ఆ వానలు కొనసాగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

Also Read :Covid-19 : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

రెడ్ అలర్ట్కొమురంభీం,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబా బాద్, వరంగల్, జిల్లాలలో అతి భారీనుంచి అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్ఆదిలాబాద్, జగిత్యాల రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు