గోదావరి ఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒక వైపు మధ్యాహ్నం వేళ ఎండవేడిమి నిప్పులు కొలిమిని తలపించేలా ఉంటే , మరో వైపు ఆకాశాన్నంటుంతోందా అన్నంతగా వచ్చిన సుడి గాలి మైదానంలోని దుమ్మును ఆకాశానికెత్తింది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం దుమ్ము రేపుతూ ఆకాశానికి ఎగిసిన ఈ సుడిగాలి సంఘటనతో ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.