Weather Forecast : తెలంగాణలో రేపు,ఎల్లుండి వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Weather Forecast : తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బుతు పవనాలు ఆదివారం తమిళనాడు, కర్ణాటక అంతటా, మరియు మహారాష్ట్ర లో మరికొంత భాగం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో మరి కొంత భాగం వ్యాపించాయని.. ఈశాన్య భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలోకి ప్రవేశించాయని కేంద్రం తెలిపింది.

తెలంగాణా , ఆంధ్రా రాష్ట్రాలలోని మెదక్, నల్గొండ, రెంటచింతల వరకు ఈరోజు బుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. నైరుతి మధ్య ప్రదశ్ నుండి మరాట్వాడా, తెలంగాణా, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మి వరకు ఉపరితల ద్రోణి వ్యాపించింది.

బుతుపవనాల రాక ప్రభావం, ఉపరితల ద్రోణి ప్రబావంతో తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని… సోమ,మంగళ వారాల్లో మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంఉందనివాతావరణ శాఖ వెల్లడించింది.

ఈనెల 3న కేరళను తాకిన నైరుతి బుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. హైదరాబాద్ నగరంలో గత రాత్రి పలు ప్రాంతాల్లో వాన కురిసింది.

ట్రెండింగ్ వార్తలు