Weather Update: ఏపీకి పిడుగుల హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
పిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో, కరెంట్ పోల్స్ కింద, పొంట పొలాల్లో ఉండరాదని సూచించారు. సురక్షితమైన ప్రదేశాల్లోనే తల దాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
- Naveen
- Published On : March 29, 2026 / 10:29 PM IST
Weather Update: ఏపీకి పిడుగు పాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. రాగల మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో, కరెంట్ పోల్స్ కింద, పొంట పొలాల్లో ఉండరాదని సూచించారు. సురక్షితమైన ప్రదేశాల్లోనే తల దాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
