AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. ఆ సమయంలో బయటకు రావొద్దు
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదంది.
- Naveen
- Published On : March 21, 2026 / 04:21 PM IST
AP Rains: ఏపీలో వానలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదంది. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Also Read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బాబోయ్.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. లీటర్ ధర ఏకంగా రూ. 22 పెంపు..!
