Diesel Prices Hike : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బాబోయ్.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. లీటర్ ధర ఏకంగా రూ. 22 పెంపు..!
Diesel Prices Hike : గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో పారిశ్రామిక డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. డీజిల్ లీటర్ మీద రూ. 22 పెరిగింది. సామాన్య ప్రజలకు విక్రయించే రిటైల్ డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు..
Diesel Prices
- గల్ఫ్ సంక్షోభం దెబ్బకు భారీగా పెరిగిన డీజిల్ ధరలు
- అంతర్జాతీయంగా బల్క్ డీజిల్ ధర లీటర్ రూ. 22 పెంపు
- సామాన్యులకు విక్రయించే డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
Diesel Prices Hike : బాబోయ్.. డీజల్ ధరలు పెరిగాయి.. ఐదో పదో కాదు.. ఏకంగా ధర రూ. 22 పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం.. అంతర్జాతీయంగా చమురు (crude oil) ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
దీని ప్రభావంతో భారత పారిశ్రామిక వినియోగదారులకు విక్రయించే బల్క్ డీజిల్ ధరను శుక్రవారం ఒక్క రోజే లీటరుకు సుమారు రూ. 22 పెంచారు. ఉదాహరణకు.. దేశ రాజధాని ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర ఇప్పుడు రూ. 87.67 నుంచి రూ. 109.59కు చేరింది.
కానీ, సాధారణ ప్రజలకు విక్రయించే డీజిల్, పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో సాధారణ డీజిల్ లీటరుకు ఇంకా రూ. 87.67 ఉండగా, పెట్రోల్ లీటర్ ధర మాత్రం రూ. 94.77 వద్ద ఉంది. ఇరాన్‌తో యుద్ధం తీవ్రతరమైన కారణంగానే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా 119 డాలర్లకు చేరాయి. ఆ వెంటనే సుమారు 108 డాలర్లకు తగ్గాయి. ఇండస్ట్రీయల్ డీజిల్ ధరల్లో భారీగా మార్పులు వచ్చాయి.
రిటైల్ ఫ్యూయిల్ ధరల్లో మార్పు లేదు :
మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదని వెల్లడించారు. కేవలం ప్రీమియం కేటగిరీలో మాత్రమే కొంత పెరుగుదల నమోదైంది. దేశంలో అమ్ముడయ్యే మొత్తం పెట్రోల్‌లో 2 నుంచి 4 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. సామాన్యుడికి అందించే రిటైల్ ఫ్యూయిల్ ధరల్లో ఎలాంటి పెంపు లేదని తేల్చిచెప్పారు.
2010, 2014లలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడంతో ధరల నిర్ణయాలను చమురు కంపెనీలే స్వతంత్రంగా తీసుకుంటాయని ఆమె అన్నారు. ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే నిర్ణయిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రించదని ఆమె పీటీఐకి తెలిపారు.
ప్రభుత్వం ప్రపంచ చమురు మార్కెట్లను నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. కానీ, రిటైల్ ఇంధన ధరలను పెంచడానికి తక్షణ ప్రణాళిక ఏదీ లేదని చెప్పారు. ప్రస్తుతానికి, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుత వ్యయ భారాన్ని భరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ఇంధన రిటైలర్లు ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు నష్టాలను భరిస్తూ ధరలు తక్కువగా ఉన్నప్పుడు లాభాలను ఆర్జిస్తున్నాయి.
భారత్‌లో స్థిరంగా ఇంధన ధరలు :
ముడి చమురు ధరలు పెరిగిన సమయంలో ప్రపంచ ఇంధన ధరలు సైతం పెరిగాయి. కానీ, భారత మార్కెట్లో మాత్రం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గినా భారత్ లో మాత్రం ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి.
ముడి చమురు ధరలలో భారీ పెరుగుదల లేనంతవరకు ఇదే ధరలు కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది. భారత్ ముడి చమురు అవసరాలలో 88 శాతాన్ని సహజ వాయువు అవసరాలలో సుమారు సగాన్ని దిగుమతి చేసుకుంటుంది.
ఇందులో ఎక్కువగా హోర్ముజ్ జలసంధి ద్వారా వస్తాయి. ఇరాన్ ప్రభుత్వం, సైనిక, అణు సౌకర్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తరువాత జలసంధికి సరిహద్దుల్లో నౌకాయానం చేయవద్దని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఇన్సూరెన్స్ సంస్థలు తమ కవరేజీని ఉపసంహరించుకున్నాయి. ఫలితంగా ట్యాంకర్ల రాకపోకలు వాస్తవంగా నిలిచిపోయాయి.
రికార్డు స్థాయిలో రూ. 81వేల కోట్లు లాభం :
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత 2022 జూన్‌లో బ్యారెల్‌కు చమురు ధరలు 119 డాలర్లకు పెరిగాయి. అదే ఏడాదిలో చమురు కంపెనీలు నామమాత్ర లాభాలను ఆర్జించాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 81,000 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మార్జిన్లలో వచ్చిన నష్టాలను కూడా పూడ్చుకున్నాయి. ఈ ఏడాదిలో 3 కంపెనీలు ఒక్క డిసెంబర్ త్రైమాసికంలోనే రూ. 23,743 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.
