కరోనా కంటే భయమే మా చెడ్డది : నెగిటివ్ అంటే పాజిటివ్ గా వినిపించి కుప్పకూలి వ్యక్తి మృతి

  • Published By: nagamani ,Published On : July 17, 2020 / 04:02 PM IST
కరోనా కంటే భయమే మా చెడ్డది : నెగిటివ్ అంటే పాజిటివ్ గా వినిపించి కుప్పకూలి వ్యక్తి మృతి

‘కరోనా కంటే భయం మా చెడ్డది’’ ప్రస్తుతం కరోనా అంటే భయపడిపోతున్నారు ప్రజలు. పాజిటివ్ అనే మాట వినిపిస్తే చాలు ప్రాణాలే పోతున్నాయి. అదే జరిగింది ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో. తన తండ్రికి కరోనా సోకలేదన్న విషయాన్ని రిపోర్టులో తెలుసుకున్న ఓ కొడుకు ఎంతో ఆనందంగా ఆ విషయాన్ని తండ్రికి చెప్పాలనే ఉద్దేశంతో “నాన్నా నీకు కరోనా నెగటివ్ రిపోర్టు వచ్చింది” అని గట్టిగా అరిచి చెప్పాడు. కానీ ఆ మాట ఆ తండ్రి పూర్తిగా అర్థం కాలేదు. తనకు కరోనా నెగిటివ్ అనుకుని అక్కడిక్కడే కుప్పకూలి మరణించాడు.

ఏలూరులోని బడేటి వారి వీధిలో నివాసం ఉంటున్న కె.అప్పారావు అనే 62 వ్యక్తికి కాస్త అనారోగ్యం చేసింది. దీంతో అతను తనకొడుకుతో కలిసి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ‘సంజీవని’ వద్దకు వచ్చి ఇద్దరూ నమూనాలు ఇచ్చారు. తరువాత మూడు రోజులకు రిపోర్టులు వచ్చాయి.అప్పారావుకి నెగటివ్ వచ్చిందని తెలియగానే కొడుకు ఆ విషయాన్ని కుమారుడు పెద్దగా అరిచి చెప్పాడు.

అసలే అప్పటికే కరోనా భయంతో ఆందోళనలో ఉన్న అప్పారావుకు కొడుకు చెప్పిన విషయం అర్థం కాలేదు. కొడుకు ‘నెగిటివ్’ అని చెప్పిన మాటను ఆందోళనలో ఉన్న అప్పారావు ‘పాజిటివ్’గా అర్థం చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కంగారుపడిన కొడుకు..కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు వెళ్లేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన అంబులెన్స్ సిబ్బంది ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. కాగా..అప్పారావు మృతదేహానికి గురువారం రాత్రి కరోనా పరీక్షలు చేయగా ఈసారి పాజిటివ్‌గా నిర్ధారణ కావటం గమనించాల్సిన విషయం.