ఫొటో కోసం ప్రాణాలకు తెగించి…వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 09:54 AM IST
ఫొటో కోసం ప్రాణాలకు తెగించి…వైరల్ వీడియో

ట్రావెల్ బ్లాగర్స్ కు ఇన్‌స్టాగ్రామ్‌ లో చెప్పలేనంత మంది ఫాలోవర్స్ ఉంటారు. నెటిజన్స్ అంతగా ఆసక్తి చూపడానికి కారణం.. వారు అద్భుతమైన ప్రాంతాల్లో ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ట్రావెల్ బ్లాగర్స్ తమ ఫాలోవర్లను పెంచుకోడానికి తమ ప్రాణాలను కూడా లెక్కచేయరు. ఎత్తైన పర్వతాలు, జలపాతాల్లో రిస్కీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 

తాజాగా బ్రెజిల్‌ లో ఓ యువతి కూడా రియో డె జనీరో‌లోని 3,000 అడుగుల ఎత్తైన రాతి శిఖరం పడ్రా దా గావియా మౌంటైన్ మీదకు ఎక్కి చివరి వరకు జారుకుంటూ వెళ్లి వీడియో తీయించుకుంది. ఈ ప్రమాదకరమైన స్టంట్‌ ను కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  

ఆమెనే పెద్ద సాహసం చేసిందంటే.. ఆమెను వీడియో తీస్తున్న వ్యక్తి తనని ఇంకా ముందుకు జరగమని ప్రోత్సహించడం చూస్తే ఆశ్చర్యపోతారు.  మొత్తానికి ఆమె కష్టానికి మంచి వీడియోనే వచ్చింది. కానీ పొరపాటున జారితే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Marque aquele amigo que vai tirar essa foto (vídeo). ?????? #willexperience She is crazy! The view was beautiful! ??? . . #riodejaneiro #pedradagavea #gargantadoceu #pedradotelegrafo #zerandorio #oquefazernorio #ondeirnorio #pagevibe #trilhandomontanhas #pagevibe #goodvibes #essemundoenosso #vibepositivamundo #brazil_repost #trilheirosdobrasil #jornalglobo #poraipasseando #euvounajanela #voegol #meucliquenafolha #meucliqueestadao #vibepositivamundo #brazil_repost #trilheirosdobrasil #vibe_natureza #vivamaishistorias #sejogacomigo #brazil_repost #vocenomundo #bomdia #revistaqualviagem #errejota

A post shared by Rio: Pedra da Gávea & foto ?? (@thaleswil) on