Pm Modi Ap Tour : మరోసారి ఏపీకి ప్రధాని మోదీ, పోలీసుల భారీ బందోస్తు.. షెడ్యూల్ వివరాలు

స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. ప్రధానమంత్రి రోడ్డు షోకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Pm Modi Ap Tour : మరోసారి ఏపీకి ప్రధాని మోదీ, పోలీసుల భారీ బందోస్తు.. షెడ్యూల్ వివరాలు

PM Modi (Photo Credit : Facebook)

Pm Modi Ap Tour : ప్రధాని మోదీ దూకుడు పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చారు. తాజాగా మరోసారి ఏపీలో పర్యటించనున్నారు. ఇటీవల రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ.. మరోసారి రాష్ట్రానికి రానున్నారు.

రేపు(మే 8) ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.35 నిమిషాలకు తిరుపతి నుంచి హెలిప్యాడ్ లో రాజంపేటలోని కలికిరికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. 3.45 నిమిషాలకు ఎన్నికల బహిరంగ సభ ప్రాంగణానికి వస్తారు. 50 నిమిషాల పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

సాయంత్రం 5 గంటల 20 నిముషాలకు సభా ప్రాంగణం నుంచి హెలిప్యాడ్ లో తిరుపతి విమానాశ్రయం కు చేరుకుంటారు. తిరుపతి నుంచి సాయంత్రం 6.25 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం కు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నారు. స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. దాదాపు గంట పాటు ఈ రోడ్ సాగనుంది. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పయనం అవుతారు.

ప్రధానమంత్రి రోడ్డు షోకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు విజయవాడ సీపీ రామకృష్ణ. ప్రధాని రోడ్ షోలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ”బందోబస్తులో పాల్గొనే అధికారులు సిబ్బంది అంకితభావంతో పని చేయాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. పోలీస్ సిబ్బందికి కేటాయించిన పాయింట్లలో అప్రమత్తంగా ఉండాలి. వీక్షకులు, ఆహ్వానితులకి కేటాయించిన మార్గాలలో ప్రోటోకాల్ పాటించాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలి. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆరుగురు ఐపీఎస్, డీసీపీ, ఎస్పీలు ఏడుగురు, ఏడీసీపీలు 22 మంది, ఏసీపీలు 50 మంది, ఇన్ స్పెక్టర్లు 136 మంది, ఎస్ఐలు 250 మందితో బందోబస్తు ఏర్పాటు చేశాం” అని సీపీ వెల్లడించారు.

Also Read : గాజువాకలో ఎన్డీయే గెలిస్తే జరిగేది ఇదే- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు