హెల్త్

ఔషధాలకు నయం కాని ఆరోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు తప్పనిసరి అసవరం అవుతున్నాయి. శస్త్రచికిత్సల ద్వారా దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తున్నారు. ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో అటు సర్జన్స్ కు, ఇటు రోగులకు సౌలభ్యమైన సర్జరీ పద్ధతులు ఎన్నో వచ్చాయి. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలకు కూడా చిన్న శస్త్రచికిత్సలతో వైద్యం అందిస్తున్నారు. తక్కువ కోతల శస్త్రచికిత్సలు ఇప్పుడు ఎంతో...

శీతాకాలంలో తేలికగా జీర్ణమయ్యే అహారాన్ని తీసుకోవాలని డైటీషియన్లు అంటున్నారు. ఈ సమయంలో సూప్స్ కి మించిన మంచి ఆహారం మరొకటి ఉండదు. సూప్‌లు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. అంతేకాదు, ఇవి శరీరం ఇన్‌ ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతో సహాయం చేస్తాయి. ఈ చల్లటి వాతావరణంలో శరీరానికి తగిన వేడి అందుతుంది. ఒక బౌల్‌ సూప్‌ తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లవవుతుంది. దీన్ని తాగడానికి...

లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మందుల ద్వారా తమ బరువను కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే.. వాటివల్ల ప్రమాదం వుండవచ్చు. సాధారణంగానే శరీర బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చాలని, రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు....

ప్రశ్న: బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చిన వారు ఆరు నెలలకోసారి రక్తమార్పిడి చేసుకుంటున్నట్లు హెచ్‌ఐవి సోకినవారు కూడా రక్తమార్పిడి ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చా?నిఖిల్‌రెడ్డి, 9వ తరగతి, ఎపిఆర్‌ పాఠశాల వేలేరు,
మడికొండ మండలం, వరంగల్‌
జవాబు: రక్త క్యాన్సర్‌ అంటే సాధారణంగా రక్తంలో కేంద్రకం (nulear) తో కూడిన తెల్లరక్తకణాలు అవిచ్ఛిన్నంగా,...

ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి పెట్టుకోవాలి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్‌ ఉప్పు, ఒక గ్లాస్‌ వాటర్‌ తీసుకొని అన్నింటినీ మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వడ పోయకుండా అలానే తాగాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అరగంట ఏమీ తినకూడదు. దీనివల్ల షుగర్‌, కొలెస్ట్రాల్‌, బీపి కంట్రోల్‌లో ఉంటాయి.

  • మొటిమలు, మచ్చలు...

రోజులో మంచినీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఇది అందరికీ తెలిసిందే. అయితే రాత్రి సమయాల్లోనూ మంచినీళ్ళు తాగడం కూడా చాలా మంచిదంటున్నారు వైద్యులు. రాత్రి పూట చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు కడుపునిండా మంచినీళ్ళు తాగితే సులభంగా నిద్రపడుతుంది. అంతకు ముందు తీసుకున్న ఆహారంలో నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో నీళ్ళశాతం తక్కువై, దాహార్తి...

రక్తనాళంలో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్‌ అని పిలుస్తారు. ఇటీవల అకాల మరణాల్లో స్ట్రోక్‌ మూడవ ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడులో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఈ స్ట్రోక్‌ లక్షణాలు కలిగి ఉంటే మాత్రం ఆలస్యం లేకుండా అత్యవసర వైద్యసహాయాన్ని తీసుకోవటం ఉత్తమం. స్ట్రోక్‌ ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. కానీ ఇటీవల మహిళల్లో పెరగడం...

అంతర్జాలం కారణంగా ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. ఈ జాలంలో చిక్కుకున్న వారంతా ఆరోగ్యాలను హరించే వస్తువును చేతిలో పెట్టుకుని తిరుగుతున్నట్టే. నేటి దైనందిన జీవితాలలో సెల్‌ ఫోన్లు ముఖ్యమైనవిగా మారాయి. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉందేమో కానీ, సెల్‌ ఫోన్‌ లేని ఇల్లు లేదన్న విషయం తెలిసిందే. అయితే సెల్‌ వాడకం ద్వారా ప్రమాదకరమైన రేడియో ధార్మిక దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది...

ఈ కాలంలో కమలాపండ్లు విరివిగా దొరుకుతాయి. సీజన్‌ ప్రకారం దొరికే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి కమలాపండ్లు తినండి.. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కమలా పండ్లలో సిట్రస్‌ పాళ్లు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్‌ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమలా పండ్లను రసం తీసి తాగడం వల్ల కిడ్నీ జబ్బులు...

మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు కట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క...

మహిళల జీవన చక్రంలో, మెనోపాజ్ ఒక కీలక దశ. మానసిక, శారీరక ఆరోగ్యంపై కీలక ప్రభావాన్ని చూపే దశ. కాస్త జాగరూకతతో ఉంటే, ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మెనోపాజ్ ని విజయవంతగా దాటే వీలుంది. ఆ వివారలేంటో, హెల్త్ కేర్ లో చూడండి..

ఇంట్లో దోమల దాడుల నుండి తప్పించుకునేందుకు నానాపాట్లు పడాల్సి వస్తుంది. అలా దోమలు విజృంభించి కొత్తకొత్త రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అలాంటి సమయాల్లో దోమల నుండి రక్షణ పొందేందుకు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

  • రోజ్‌మేరీ మొక్క కాడలను కాల్చితే ఆ వాసనకు దోమలు పారిపోతాయి. దోమ కుట్టినప్పుడు వచ్చే వాపు, నొప్పి తగ్గాలంటే ఆ ప్రదేశంలో ఐస్‌ప్యాక్‌ని ఉంచాలి....

మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో ఉపకరిస్తాయి. శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే మెంతులు మనందరికీ తెలిసినవే. ఔషధ దినుసుగానూ ఆయుర్వేదంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే మనకు అందుబాటులో ఉండే దినుసు. ఇటీవల కాలంలో మెంతులను మధుమేహన్ని అదుపులో ఉంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మెంతులలో ఉండే ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి...

వాకింగ్‌, జాగింగ్‌ చేసే అలవాటు లేదా?! ఒకప్పుడు ఉన్నా.. ఈమధ్య తీరుబడిలేక మానేశారా?! చాలా రోజులుగా మళ్ళీ ఉదయంపూట నడక ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ''మంచి కాలం ఇదేనండోయ్'' అంటున్నారు ఆరోగ్యనిఫుణులు. బాగా వేడిగా ఉండే ఎండాకాలం, జోరుగా వానలు పడే వర్షాకాలంలో వాకింగ్‌, జాగింగ్‌లకు కాస్త అంతరాయం కలగొచ్చు. కానీ చలిచలిగా ఉండే శీతాకాలంలో మాత్రం ఎలాంటి ఆటంకాలూ ఉండవు. నడక అయినా,...

మొటిమలు..యువతీ యువకులు ప్రధాన సమస్య ఎదుర్కొంటుంటారు. ఇందుకు రకరకాల క్రీములు వాడుతూ ముఖాన్ని..ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. ఇందుకు కొన్ని టిప్స్ అనుసరిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటుంటారు. మీ కోసం కొన్ని టిప్స్...

  • బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
  • వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్...

సాధారణంగా కొంతమందిలో రక్తపోటును చూస్తుంటాం. శరీరంలోని రక్త నాళాలలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్‌ ప్రెషర్‌ (బీపీ) అంటారు. బ్లడ్‌ ప్రెషర్‌ వచ్చాక నయం కావడమన్నది ఉండదు. అయితే జీవనవిధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బీపీ రాకుండా జాగ్రత్తపడొచ్చు. చిన్న చిన్న మార్పుల ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

- ఆహారంలో ఉప్పు వాడకం...

చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్‌ టానిక్‌లా పనిచేస్తుంది.
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజ మూలానికి బలం చేకూర్చే...

ఇంటి ఆవరణలో పెంచుకునే పూల మొక్కలు ఆ ఇంటికి అందాన్నిస్తాయి. మరి ఆ మొక్కలు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచుతాయంటే నమ్ముతారా? అవునండి, ప్రశాంతమైన నిద్రకు కొన్ని పూల మొక్కల పెంపకం ఓ అద్భుత మార్గమని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ మొక్కలేంటో తెలుసుకుందాం..
మల్లె మొక్క: ఓ అధ్యయనంలో సహజ నిద్ర సహాయకారిగా పనిచేసే సామర్థ్యం మల్లెపూలలో ఉందని తేలింది. సానుకూల...

క్యాన్సర్.. ఈ పేరు వినగానే ఒక భయం... మరణానికి చేరువవుతున్నామన్న దిగులు మనిషిని వెంటాడుతుంది.. క్యాన్సర్ ఉందంటే చాలు.. ఇక జీవితానికి చరమగీతమేనన్నభావన మొదలవుతుంది.. .. కానీ, అది తప్పని , మనోబలంతో దాన్ని జయించొచ్చని ఎంతో మంది క్యాన్సర్ బాధితులు నిరూపించారు.. నిరూపిస్తున్నారు....ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా మాసంగా జరుపుకుంటున్న సందర్భంగా మానవి స్పెషల్...

కొన్ని కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ వండే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి.
ఆకు...

జీలకర్రకు వంటల్లో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అలాంటి జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఐరన్‌ లోపం...

ప్రస్తుత జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్మం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లోనుంచి బయటకు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల తంటాలు పడుతుంటారు. అంతేకాదు.. ఈ మొటిమలు తగ్గిన చోట వాటి మచ్చలు అలాగే...

Pages

Don't Miss