హెల్త్

  • ప్రతి రోజు కనీసం రెండు..మూడుసార్లు గ్రీన్ టీ తాగండి. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. జీర్ణప్రక్రియ వేగవంతమై ఉల్లాసంగా ఉండేలా గ్రీన్ టీ దోహదం చేస్తుంది.
  • మెంతులను బాగా నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే చండ్రు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
  • చుండ్రు నివారణకు తరచూ షాంపూతో తలస్నానం చేయాలి...

వెల్లుల్లిలో సల్ఫర్ పుష్క‌లంగా ఉంటుంది. స‌ల్ఫ‌ర్‌ రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకుపోకుండా చూస్తుంది. ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీనివ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇందులోని అలిసిన్ రోగ‌కార‌క సూక్ష్మకిముల‌పై పోరాడుతుంది.
జ‌లుబు, శ్వాస‌కోస స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వెల్లుల్లిని రోజూ తింటే శ‌రీరంలో ఉండే వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. ఆలీల్...

పండ్లు..కూరగాయలు..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండులో బీటా కెరోటిన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉంటాయి.
పోటాషియం, పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితంగా హృద్యోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ.
బొప్పాయిలో కోలిన్ అనే పదార్థం ఉండడం...

ఆరోగ్యం..ఉదయం లేచినప్పటి నుండి ఉరుకుల పరుగులతో జీవనం సాగిపోతుంటుంది. వ్యాయామం..సరియైన ఆహారం తీసుకోకపోవడంతో పలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. కానీ ప్రతి రోజు కొన్ని చిట్కాలు పాటిస్తే అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు...

  • ప్రతి రోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం అవశేషాలు నోట్లో మిగలకుండా...

ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు...అసలు టైం దొరకడం లేదు..ఇంకా ఆరోగ్యంపై శ్రద్ధా అని కొందరు పెదవివిరుస్తుంటారు. కానీ ఎన్ని పనులున్నా కొద్దిసేపైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తుంటారు. కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడిన సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలు తీరే అవకాశం ఉంది.

వాంతులు అదే పనిగా అవుతుంటే దానిమ్మ గింజలను చప్పరించి చూడండి. స్థూలకాయం ఎంతకు...

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగుల జీవితం. ఈ సమయంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఉత్సాహం చూపరు. ఏకంగా మధ్యాహ్న భోజనానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల పలు సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో జీవక్రియ దెబ్బతింటుందని..అనేక రకాల సమస్యలు కోరి తెచ్చుకొనే వారవుతారని పేర్కొంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ...

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

  • పచ్చిమిరపకాయలు పాడుకాకుండా ఉండాలంటే వాటి తొడిమలను తీసేసి ఫ్రిజ్ లో నిల్వ చేసుకొంటే తొందరగా పాడవవు.
  • బియ్యం తెల్లగా రావాలంటే ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వస్తే అన్నం తెల్లగా వస్తుంది.
  • క్యాబేజీ కూర చేసే సమయంలో పచ్చివాసన వస్తుంటుంది. ఈ సమస్య తీరాలంటే ఒక బ్రెడ్ ముక్కను వేసి చూడండి.
  • ముక్కు రంధ్రాల నుండి రక్తం కారుతుంటే దానిమ్మ రసాన్ని రెండు...

చలికాలం వచ్చిదంటే చాలు చర్మం మొత్త పొడిపడం మొదలౌతుంది. బయటకి వేళ్లమంటే వాతావరణ కాలుష్యం వల్ల చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా మారిపోతుంది. మన చర్మల అలా మారుకుండా ఉండాలంటే క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

బయటకు వెల్లివచ్చిన వెంటనే ముఖం, కాళ్లు, చేతుల్ని శుభ్రంగా కడగాలి. దీంతో పేరుకున్న దుమ్మూ, ధూళీ పోయి చర్మ శుభ్రపడుతుంది. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరినూనె తీసుకుని...

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నవ్వు. నవ్వు ఒక భోగం... నవ్వించడం యోగం... నవ్వలేకపోవడం రోగం అన్నారు. నవ్వు గురించి తెలిసిన మహానుభావులు. నవ్వు ఓ మనిషి తనకు తాను తయారుచేసుకునే అద్భుత సౌందర్య సాధనం. నవ్వుకు మరే ఇతర సౌందర్య సాధనమూ సాటి రాలేదు. నవ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మానసికొల్లాసం..మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది.

  • హాస్య సంఘటనల గురించి...

ఎండకాలం వచ్చిందంటే చర్మ సంబంధిత సమస్యలతో పాటు చెమట కాయల సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెమట కాయల నుండి బయటపడటానికి వివిధ పౌడర్లు..క్రీములు వాడుతుంటారు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో చెమటకాయలకు చెక్ ఎలా పెట్టవచ్చో చూద్దాం...
టిష్యూ పేపర్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి చెమటకాయలున్న చోట అద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుముఖం పడుతాయి.
బ్లాక్...

మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఆకుకూరలో రాణి వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, కొయ్యితోటకూర, వంటి పలు రకాలు ఉన్నాయి. ఆకు కూరలలో పీచు పదార్థంతో ఐరన్, పలు రకాల పోషక విలువలు నిండి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కెరోటిన్‌ అనే పదార్ధం సమృద్ధిగా ఉం టుంది. శరీరంలో కెరోటిన్‌ విటమిన్‌ 'ఎ'గా మారుతుంది. విటమిన్‌ 'ఎ' చర్మాన్ని...

ఫిబ్రవరి చివరి వారం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలు పెట్టారు. మార్చి నెలాఖరు రోజుల్లో ఎండలు మరింత ముదురుతున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండలో వెళ్లడం ద్వారా పలు చర్మ..ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వచ్చు.

  • ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల...

ఆడవారు చేతివేళ్లు మరింత అందంగా కనిపించాలని పలు రకాల నెయిల్ పాలిష్ ను వాడుతుండడం చూస్తూనే ఉంటాం. ఒక రంగులోనే కాకుండా ఎన్నో రంగులను వీరు ఉపయోగిస్తుంటారు. నెయిల్ పాలిష్ ను తొలగించుకోవడానికి చాల కష్టాలు పడుతుంటారు. ఏవో రకాల క్రీమ్స్..లోషన్స్ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల గోర్లు కళావిహీనంగా మారుతాయి. అందుకోసం కొన్ని చిట్కాలు...

  • కొద్దిగా...

ఉత్సాహం..ఉత్తేజం రావడానికి చాలా మంది కాఫీలు..టీలు తాగుతుంటారు. నిత్యం మనం తాగే ఇలాంటివి కన్నా బ్లాక్ టీ తాగడం ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో అనారోగ్యాలను నయం చేసుకోవచ్చంట. పాలు..చక్కెర లేకుండా తయారు చేసుకోవడమే బ్లాక్ టీ. మరి దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దామా..

  • దంత సమస్యలు ఉండే వారు నిత్యం ఒక కప్పు బ్లాక్ టీ...

తామర గింజలు...చాలా మందికి తామర గింజలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇవి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బోలెడన్నీ పోషక పదార్థాలు ఉంటాయంట. ఆగస్టు..సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా తామర పూలొస్తాయనే సంగతి తెలిసిందే.

తామరపువ్వు నుండి తామర గింజలు వస్తాయి. వీటిని పచ్చిగానే ఉపయోగిస్తుంటారు. మరికొందరు వేయించుకుని ఉడకపెట్టుకుని కూరల్లో వాడుతుంటారు....

ఉరుకుల పరుగుల జీవితం..ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు బిజీ బిజీగా గడుపుతుంటారు. దీనితో వారు కొంత మానసిక వత్తిడికి గురవుతుంటుంటారు. రోజు లేవగానే ఏదో వెలితి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. మరి రోజంతా ఆహ్లాదంగా..ఉల్లాసంగా ఉండాలంటే ఏమి చేయాలి.

  • ఉదయం లేవగానే చేతులను..మెడను..కాళ్లు..చేతులను అటూ ఇటూ కదుపుతూ చిన్న పాటి వ్యాయామాలు చేయండి. ఇలా బెడ్...

రోజు వారి పనుల్లో భాగంగా మన గురించి మనమే పట్టించుకోవడం మానేశాం. ప్రస్తుతం అలాంటి రోజులున్నాయి. కానీ అలా పట్టించుకోకుండబా ఉండడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా కోల్పోతుంటాం. రాత్రి పడుకొనే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే అందం మెరుగయ్యే అవకాశం ఉంది.
రాత్రి పడుకొనే ముందు తాజా కొబ్బరినూనెతో ముఖానికి మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కోమలంగా ఉండడమే కాకుండా...

ఉప్పు..అన్నీ వేసి చూడు..చివర్లో నన్ను వేసి చూడు అని సామెత. వంటకాల్లో ఉప్పు లేకపోతే దాని రుచే వేరేగా ఉంటుంది. అదే సందర్భంలో ఉప్పు ఎక్కువయినా ప్రమాదమే. పరిమితంగా ఉప్పును తీసుకుంటే బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది ఉప్పును చాలా ఎక్కువగా ఇష్టపడుతారు. ఉప్పులో ఉండే అయోడిన్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. రుచి కోసం ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక...

కండరాల నొప్పులకు కారణం.? నివారణ చర్యలేమిటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మొదలైన విషయాలపై ఎక్స్ పర్ట్ డాక్టర్ రెండు నిమిషాల్లో చాలా అద్భుతంగా వివరించారు. మీరు ఈ వీడియో చూడకుంటే చాలా మిస్ అవుతారు. డోంట్ మిస్ ఇట్. 

పలు రకాల కూరగాయల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ తినడం ఎంతో మంచిదని..ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బీన్స్ లో విటమిన్ బీ 6, థయామిన్‌, విటమిన్‌ సి లభిస్తాయి. దీనితో బీన్స్ తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలకు బలం చేకూరుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుసాతయి.....

బీరకాయ.. ఈ పేరు అందరికీ సుపరిచతమే. అందునా తెలుగు ప్రజలు విరివిగా ఉపయోగిస్తారు. బీరకాయలో పందిర బీర, పొట్టి బీర, నేతిబీర, గుత్తిబీర అని వివిధ రకాలున్నాయి. అయితే ఈ బీరలో ఏఒక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రస్తుత సీజన్ లో బీరకాయలు చాలా విరివిగా దొరకుతాయి. బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్ తో పాటు అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఇందులో...

ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ మంచిదే కానీ కొన్నిసార్లు చర్మ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ చర్మానికి వాడడం వల్ల పలు దుష్రభావాలు వచ్చే అవకాశం ఉందంట. అలర్జీలున్న వారు ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండడం మంచిది. అలర్జీ కలిగి ఉండి చర్మానికి రాయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక అప్పుడే జన్మించిన శిశువుకు ఆలివ్ ఆయిల్ రాయకూడదంట...

కరివేపాకులు తినడం వల్ల కొన్ని పోషకాలు అందుతాయనే విషయం తెలిసిందే. తద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినడమే కాకుండా అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖానికి..తలకు పట్టించినా కూడా మంచిదే. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

  • ముఖ వర్ఛస్సును పెంచడమే కాకుండా జుట్టుకి మెరుపుదనాన్ని ఇస్తుంది.
  • ...

సమ్మర్ రాగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి పండ్లు , ఇవి వేసవి సీజన్‌లో విరివిగా లభించే పండ్లు . ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో చాల విసరివిగా లభిస్తాయి. బంగారపు వన్నె కలిగి పసుపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు . అలాంటి మామిడి పండును ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పరిశోధకులు తెలిపారు. అలాంటి మామిడి పండులో క్యాలరీల శక్తి,...

వంటిల్లు..భోజనాలు సిద్ధమయ్యేది ఇక్కడే. ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోవాలని పలువురు సూచిస్తుంటారు. వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులతో ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు.

  • వెల్లుల్లిలో విటమిన్స్..అయోడిన్..సల్ఫర్..ఆంటీ యాక్సిడెంట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.
  • కొలెస్ట్రాల్‌ను కరిగించి...

రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.
డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.
వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల...

ఆరోగ్యం బాగా ఉండాలంటే మంచి ఆహారం..జ్యూస్ లు..విటమిన్స్ కూడిన వాటిని తినాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 15 ఉత్తమమైన ఆహారాలు మీ కోసం...

  1. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధిని ఆపడానికి దోహద పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లను దాల్చిన చెక్క కలిగి ఉంటుంది.
  2. సోయాలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని...

వ్యాయామం..వయస్సు తేడా అనేది లేకుండా ప్రతొక్కరూ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కళ్ల విషయంలో కొంతమంది అశ్రద్ధ కనబరుస్తుంటారు. ఫలితంగా కంటి సమస్యలు ఏర్పడుతాయి. కళ్ల ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి సమస్యలుండవు.
కళ్లను గట్టిగా మూసి..తెరవడం వంటివి చేయాలి. ఇలా ఏడు..ఎనిమిది సార్లు చేయాలి.
కళ్లను చేతులతో మూసి ఉంచి నెమ్మదిగా...

గుప్పెడు పల్లీలతో పిడికెడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వేరు శనగలు లేదా పల్లీలు రోజూ ఓ గుప్పెడు తింటే చాలు అందమైన ఆరోగ్యం మీ సొంత అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పల్లీలు తింటే ఫ్యాట్ చేరుతుందని, అలర్జీని చాలా మంది వీటిని తినకుండా ఉంటారు. పల్లీలను పరిమితంగా తింటే ఎలాంటి హానీ ఉండదు. ఇంకా మెరుగైనా...

చుండ్రు...ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఎవో షాంపులు వాడుతూ జుట్టు సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చుండ్రు సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలు..

  • ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెకు 5-10 చుక్కల ట్రీ ఆయిల్ కలపాలి. అనంతరం దీనిని మాడుకు పట్టించాలి.
  • నిమ్మరసం మాడుకు పట్టించి...

చాలా మందికి ఎప్పుడో ఒకసారి నోటిపుండ్లు అవుతుంటాయి. భోజనం..ఇతర పదార్థాలు తీసుకోవాలన్నా చాలా అవస్థలు పడుతుంటారు. కొద్దిగా కారం తగిలినా విలవిలలాడుతుంటారు. నాలుక..పెదాలు..నోటిపై భాగం..చిగుళ్లలో ఈ ఎర్రటి పుండ్లు వస్తుంటాయి. అనుకోకుండా కొరుక్కోవడం లేదా నోట్లో ఏర్పడ్డ గాయం వల్ల పుండ్లు ఏర్పడతాయి. విటమిన్‌ లోపం వల్ల కూడా పుండ్లు ఏర్పడతాయి. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుండి...

శరీర బరువు పెరిగిపోతోంది..ఆహారం తగ్గించాలి..ఏదైనా సర్జరీ చేయించుకోవాలని పలువురు అనుకుంటూ ఉంటారు. అంతేగాకుండా చాలా మంది డైట్ కంట్రోల్ కూడా చేస్తుంటారు. దీనికి చక్కటి పరిష్కారం 'స్కిప్పింగ్' చేయడమే. దీని ద్వారా ఊబకాయాన్ని నివారించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అబ్బా..ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న తాడాట. ఇంత వయస్సులో ఆడటమా అని మాత్రం అనుకోకండి. స్కిప్పింగ్‌ చేస్తే శరీరం బరువు...

ఇతర దేశాలకు భిన్నంగా భారతీయ మహిళలు బంగారంపై మక్కువ పెంచుకుంటుంటారు. బంగారు ఆభరణాలను ఎంతో ఇష్టంగా కొనుక్కుంటుంటారు. అంతేగాకుండా పలువురు కానుకలు కూడా ఇస్తారు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్నా..కానుకగా వచ్చిన ఈ ఆభరణాలు పాతబడిపోతే..గీతలు పడితే బాధ పడుతుంటారు. కానీ చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యలు రావు.

  • వివిధ ఫంక్షన్లకు వేసుకునే ఆభరణాలను చల్లటి..పొడి...

పెరుగు..ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో చాలా ఉపయోగకరం. పెరుగును అందంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
మజ్జిగలో పలుచటి బట్టను ముంచి ఆ బట్టను ముఖం మీద వేసుకోవాలి. ఇలా పది నిమిషాలకి నాలుగైదు సార్లు చేయాలి. అనంతరం శుభ్రమైన పొడిబట్టతో తుడుచుకోవాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లలో బట్టను ముంచి తుడుచుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం బాగుంటుంది.
మెటిమలు ఎక్కువగా...

మనం తినే కూరగాయాల్లో మునగ కాయది ఎంతో ప్రత్యేకమైన స్థానం. నిజానికి మునగ కాయ కంటే మునగ ఆకులోనే ఎక్కువ పోషకాలుంటాయి. అయితే ఒక్క ఆషాడం లోనే కాదు, ఏడాది పొడవునా లేత మునగాకు వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం. మునగాకులో ఎ,సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మునగాకుల్లో విటమిన్లు, అమినో యాసిడ్స్‌, మినరల్స్‌ సమృద్ధిగా ఉన్నాయి. పాల నుంచి లభించే క్యాల్షియంకు...

Pages

Don't Miss